వీడియో: వారెవ్వా త‌లైవా 70 వ‌య‌సులో ఈ సాహ‌సాలేంటి?

Update: 2020-03-09 11:38 GMT
కొండ‌లు గుట్ట‌లు.. ప‌ర్వ‌తాలు.. ఇసుక ఎడారులు.. అడ‌వులు.. న‌దీ ప్ర‌వాహాలు.. స‌ముద్ర తీరాలు.. మంచు ఖండాలు.. ఒక‌టేమిటి క‌నిపించిన ప్ర‌తి చోటికి వెళ్లిపోతాడు. గాల్లోంచే దూకేస్తాడు. తాళ్ల సాయంతో కొండ‌ల్ని పాకేస్తుంటాడు. దారిలో దొరికిన పురుగు పుట్ర తిని బ‌తికేస్తుంటాడు. మంచి నీళ్లు లేని ఎడారుల్లో ఒంట‌రిగా అత‌డి సాహ‌సాలు.. క్రూర‌మృగాలు తిరిగే చోట వైల్డ్ లైఫ్ జ‌ర్నీ అబ్బో.. ఇలా చెప్పుకుంటూ వెళితే అస‌లు అత‌డేమైనా యంత్రుడా?  రోబో 2.0 నా? అని ప్ర‌శంసించ‌కుండా ఉండ‌లేం. అత‌డు నిజంగానే లైవ్ రోబో లాంటోడే! అంతటి ఫేమ‌స్ ప‌ర్స‌నాలిటీ ఎవ‌రో ప్ర‌త్యేకించి చెప్పాలా?  డిస్క‌వ‌రీ.. సోనీ బీబీసీ లాంటి ఛానెళ్ల‌లో ప్ర‌త్యేకించి సాహ‌స  యాత్ర‌ల‌తో గ‌గుర్పొడిచే విన్యాసాల‌తో క‌ళ్లు తిప్పుకోనివ్వ‌ని సాహ‌సికుడు బేర్ గ్రిల్స్ గురించే ఇదంతా.

సాహస యాత్రికుడు బేర్‌ గ్రిల్స్‌తో పోటీప‌డుతూ ఇప్ప‌డు త‌లైవా రజనీకాంత్‌ సాహసయాత్రకు దిగాడం..అంత‌టి సాహ‌సికుడికే ఛాలెంజ్ లు విస‌ర‌డం చూస్తుంటే షాక్ తిన‌కుండా ఉండ‌లేం. అది కూడా 70 ప్ల‌స్ వ‌య‌సులో ర‌జ‌నీ వైల్డ్ లైఫ్ జ‌ర్నీ సాహ‌సాలు చూస్తుంటే ఔరా! అంటూ ముక్కున వేలేసుకోకుండా ఉండ‌లేం.  బేర్ గ్రిల్ ని మించి స్టైలిష్ గా ప్రిపేరై ర‌జ‌నీ అతనితో సమానంగా కొండలు.. గుట్టలు ఎక్కుతూ దిగుతూ సాహసాలతో అబ్బుర‌ప‌రిచాడు.

ఈ అడ్వెంచ‌ర్ ట్రిప్ కి సంబంధించిన  వీడియోలో ఓచోట న‌డుము లోతు నీళ్ల‌లోకి దిగితే బేర్ గ్రిల్ కిందికి జారిపోయాడు. కానీ త‌లైవా మాత్రం చెక్కు చెద‌ర‌ని ధీక్ష‌తో ఆ న‌దిని దాటి శ‌హ‌భాష్ అనిపించాడు. ఇలాంటి ఎన్నో అద్భుతాల్ని ఈనెల 28న డిస్క‌వ‌రీ చానెల్ లో వీక్షించేందుకు అభిమానుల ముందుకు వ‌స్తోంది. ఈ ఏజ్ లో రజనీ చ‌లాకీత‌నం బేర్ గ్రిల్స్ కే షాకిచ్క‌చింది.  ర‌జ‌నీ ఎన‌ర్జీ చూశాక `యూ ఆర్‌ ఏ సూపర్‌ హీరో` అంటూ పొగిడేశాడు. ఈ అడ్వెంచర్‌ యాత్రను కర్ణాటకలోని బండీపూర్‌ అభయారణ్యంలో చిత్రీక‌రించారు. ఈ పూర్తి ప్రోగ్రామ్ డిస్కవరీ చానెల్ లో ప్రసారం కానుంది.  `ఇన్ టూ ద వైల్డ్‌ విత్‌ బేర్‌ గ్రిల్స్‌- ర‌జ‌నీకాంత్ వ‌ర్సెస్ బేర్ గ్రిల్స్‌` టీజ‌ర్ ఆద్యంతం క‌ట్టిప‌డేసింది.

సాహస యాత్రలకు మారుపేరైన బేర్‌ గ్రిల్స్ దేశంలోని ప్ర‌ముఖులంద‌రితో ఈ త‌ర‌హా సాహ‌స కార్య‌క్ర‌మాలకు శ్రీ‌కారం చుట్ట‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇదివ‌ర‌కూ భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఓ డాక్యుమెంటరీ రూపొందించారు. ఉత్తరాఖండ్ లోని జిమ్‌ కార్బెట్‌ జాతీయ పార్కులో ఆ డాక్యు డ్రామాను తెర‌కెక్కించి టీవీ చానెళ్ల‌లో రిలీజ్ చేశారు. దానికి స్పంద‌న అద్భుతంగా వ‌చ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా మోదీ బల్లెం తయారు చేయడమే కాక తెప్పపై ప్రయాణించిన వీడియో వైర‌ల్ అయ్యింది.

Full View
Tags:    

Similar News