యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్. ఆయన నటిస్తున్న లేటెస్ట్ ఫీల్ గుడ్ మూవీ `సీతారామం`. హను రాఘవపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. `యుద్ధంతో రాసిన ప్రేమకథ` అని క్యాప్షన్. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ పై భారీ చిత్రాల నిర్మాత సి. అశ్వనీదత్ నిర్మిస్తున్నారు.
పీరియడిక్ ఫిక్షనల్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 1965 నేపత్యంలో సాగే ఓ అందమైన ప్రేమకథగా ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. కీలక పాత్రలో నేషన్ క్రష్ రష్మిక మందన్న నటిస్తోంది.
అఫ్రీన్ అనే ముస్లీమ్ యువతిగా రష్మిక కథని కీలక మలుపు తిప్పే పాత్రలో కనిపించబోతోంది. ఇప్పటి వరకు విడుదల చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా విషాల్‌చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ మూవీలోని లిరికల్ సాంగ్స్ కు సంబంధించిన వీడియోలని విడుదల చేశారు. ఓ సీత.. హే రామా.., ఇంతందం.. అంటూ సాగే లిరికల్ వీడియోలని విడుదల చేశారు.
తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానున్నఈ మూవీలో రష్మికతో పాటు మరో కీలక పాత్రలో హీరో సుమంత్ నటిస్తున్నారు. ఇందులో ఆయన పాత్ర పేరు బ్రిగేడియర్ విష్ణుశర్మ. శనివారం సుమంత్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. మేకోవర్, లుక్ చాలా కొత్తగా వుంది. ఇంత వరకు కనిపించని లుక్ లో మెలితిప్పిన మీసాలతో సీరియస్ లుక్ లో సిగరేట్ కాలుస్తూ సుమంత్ కనిపిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. గతంలో సాఫ్ట్ క్యారెక్టర్లలో కనిపించిన సుమంత్ ఫస్ట్ టైమ్ సీరియస్ క్యారెక్టర్ లో బ్రిగేడియర్ విష్ణుశర్మగా కనిపించబోతున్నారు.
ఈ సీరియస్ బ్రిగేడియన్ కు సీతరామమ్ కు ఉన్న సంబంధం ఏంటీ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక ఈ పాత్రకు సంబంధించిన డైలాగ్ మోషన్ పోస్టర్ ని కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. `కొన్ని యుద్దాలు మొందలు పెట్టడం మాత్రమే మన చేతుల్లో వుంటుంది. ముగింపు కాదు.. దిల్ ఈజ్ బ్రిగేడియర్ విష్ణుశర్మ.. మద్రాస్ రెజిమెంట్` అంటూ సుమంత్‌సీరియస్ టోన్ తో చెప్పిన డైలాగ్ లు ఆకట్టుకుంటూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఈ పాత్ర గురించి సుమంత్ ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. `బ్రిగేడియర్ విష్ణు శర్మ చాలా క్లిష్టమైన పాత్ర. చాలా కోణాలు వుంటాయి. #SitaRamam స్క్రిప్ట్ మొత్తం చదివిన తర్వాత అద్భుతం అనిపించింది. ఇలాంటి పాత్రలు సాధారణంగా రావు. ఇది నెగిటివ్ పాత్ర కాదు. కానీ వైవిధ్యంగా వుంటుంది. ఒక సవాల్ తో కూడుకున్న పాత్ర. ఆ సవాల్ నచ్చే ఒప్పుకున్నా` అని అన్నారు. పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఆగస్టు 5న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు.
Full View