పూనమ్ ఎపిసోడ్: కంప్లైంట్ ఇస్తే వాటిపై విచారణ!

Update: 2019-04-20 12:36 GMT
హీరోయిన్ పూనమ్ కౌర్ ఈమధ్య సైబర్ క్రైమ్ సెల్ ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.  తనకు సంబంధించిన ఫోన్ కాల్స్ ఆడియో క్లిప్ లను యూట్యూబ్ ఛానెల్స్ లో ప్రచారం చేస్తున్నారని.. దీంతో వేదనకు గురవుతున్నానని.. తనపై దుష్ప్రచారం సాగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ పలు యూట్యూబ్ ఛానెల్స్ పై ఫిర్యాదు చేసింది.  ఇదిలా ఉంటే తాజాగా ఈ ఎపిసోడ్ కు సంబంధించి ఒక ప్రముఖ లీడింగ్ ఇంగ్లీష్ డైలీ ఫుల్ పేజి కథనాన్ని ప్రచురించింది. 

ఓవరాల్ గా కథనంలో ఉన్న సారాంశం ఏంటంటే.. దాదాపు 40 వరకూ ఆడియో క్లిప్స్ ను యూట్యూబ్ లో సర్క్యులేషన్ లో ఉన్నాయి.  ఇవి ఫేక్ ఆడియో క్లిప్స్ అని మాత్రం పూనమ్ చెప్పడంలేదు. అవి నకిలీవని అలా నకిలీ ఆడియో క్లిప్ లను తయారు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పూనమ్ కేసు పెట్టలేదు.  తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోన్ కాల్స్ ను ఇలా బహిరంగపరచడం.. అది తనకు వేదన కలిగించడంపై మాత్రమే కేసు పెట్టింది.   ఇక ఈ కేసు పై సైబర్ క్రైమ్ అడిషనల్ డీసీపీ రఘువీర్ మాట్లాడుతూ.. ఫోన్ కాల్స్ ను ఎవరు లీక్ చేశారు.. ఎవరు ఆన్ లైన్ లో పెట్టారు అనే దిశగా విచారణ సాగుతోందని తెలిపారు. ఇలా అనుమతి లేకుండా వ్యక్తిగత కాల్స్ ను పబ్లిక్ చేయడం  సైబర్ నేరాల చట్టం లోనే సెక్షన్ 66C ప్రకారం సైబర్ హరాస్ మెంట్ కిందకు వస్తుందని..  ఎవరు లీక్ చేసి ఉండొచ్చనే విషయంలో ఇద్దరు అనుమానితుల గురించి పూనమ్ సమాచారం ఇచ్చిందని తెలిపారు.మరో వైపు లీక్ కాల్స్ ను ఆన్ లైన్ లో పెట్టిన అప్లోడర్స్ కు సంబంధించి వివరాలు అందజేయాల్సిందిగా యూట్యూబ్ నిర్వాహకులను కోరామని త్వరలో ఆ సమాచారం తమకు అందుతుందని తెలిపారు.

ఇక ఫోన్ కాల్స్ లో ఉండే కంటెంట్ గురించి.. అందులో ఉండే ఆరోపణల గురించి విచారణ జరపడం లేదని రఘువీర్ స్పష్టం చేశారు. అయితే ఫోన్ కాల్స్ లో ఉండే ఇన్ ఫర్మేషన్ మీద సంబంధిత వ్యక్తులు కనుక ఫిర్యాదు చేస్తే మాత్ర ఆ దిశగా కూడా విచారణ జరుపుతామని క్లారిటీ ఇచ్చారు.  అంటే.. స్ట్రెయిట్ గా చెప్పుకుంటే పూనమ్ కౌర్ కనుక పవన్.. లేదా త్రివిక్రమ్ పై ఫిర్యాదు చేస్తే మాత్రం పోలీసులు వారిని విచారించే అవకాశం ఉంది.  పూనమ్ అలా చేయలేదు కాబట్టి.. ప్రస్తుతం ఆ టాపిక్ పూర్తిగా అవుట్ అఫ్ స్కోప్.
 
Tags:    

Similar News