సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ కబాలి.. తమను కాపీ కొట్టారంటూ బాలీవుడ్ హీరో ఇర్ఫాన్ ఖాన్ తాజాగా ఓ బాంబ్ పేల్చాడు. తమ చిత్రం మదారి పోస్టర్ ను కబాలి యూనిట్ కాపీ కొట్టారని.. అయినా తమకేం బాధ లేదని.. ఆడియన్స్ రెండు సినిమాలు చూడాలంటూ ఉదారంగా కబుర్లు చెప్పిన ఇర్ఫాన్ ఖాన్ ఇప్పుడు అసలు విషయం చెప్పాడు.
అసలు ఈ పోస్టర్ కబాలి అఫీషియల్ కాదని ఈ హీరోకి ముందే తెలుసట. జోక్ చేశానంటూ ఇప్పుడు జోకులేస్తున్నాడు ఇర్ఫాన్ ఖాన్. 'ఒక నటుడిగా మంచి వ్యక్తిగా రజినీకాంత్ ని నేను ఎప్పుడూ గౌరవిస్తాను. నేను ఆ పోస్టర్ పై చెప్పినది ఒక జోక్ మాత్రమే. నేను ఏ పోస్టర్ గురించి అయితే మాట్లాడానో.. అది రజినీ ఫ్యాన్ క్లబ్ తయారు చేసినది. ఆ విషయం నాకు తెలిసింది' అంటూ చెప్పుకొచ్చాడు ఇర్ఫాన్ ఖాన్.
ఇండియాలో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టుల్లో ఒకటిగా మారిన కబాలిపై.. కాపీ ఆరోపణలు సంచనలం సృష్టించాయి. ఇప్పుడు ఒక పోస్టర్ విషయంలో క్లారిటీ వచ్చింది. కానీ కబాలి స్టోరీ పై మాత్రం ఇంకా ఓ సస్పెన్స్ కొనసాగుతోంది. టాలీవుడ్ మూవీ ఛత్రపతిని పోలినట్లుగా కబాలి కథ ఉందని ఓ ప్రచారం జరుగుతోంది. శ్రీలంక నుంచి వచ్చి వైజాగ్ లో డాన్ గా ప్రభాస్ ఎదిగినట్లుగానే.. తమిళనాడు నుంచి మలేషియా వెళ్లి అక్కడ డాన్ గా మారిన వ్యక్తి కథే కబాలి అంటున్నారు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం రిలీజ్ వరకూ ఆగాల్సిందే.