మ‌రో హీరోయిన్ అనారోగ్యం బారిన ప‌డిందా?

Update: 2022-12-28 12:01 GMT

సమంత మ‌యోసైటిస్ అనే వ్యాధి భారిన ప‌డ‌టంతో? ఎంత‌గా ఇబ్బంది ప‌డిందో తెలిసిందే. ఉన్న ప‌ళంగా  షూటింగ్ లు క్యాన్సిల్ చేసుకోవాల్సి  వ‌చ్చింది. ఆ కార‌ణంగా ఎక్క‌డికక్క‌డ చిత్రీక‌ర‌ణ‌లు నిలిచిపోయాయి. దీంతో నిర్మాత‌లు..హీరోలు అంతా వెయిట్ చేయాల్సి వ‌చ్చింది. ఆ ర‌కంగా కొంత డిస్ట‌బెన్స్ క్రియేట్ అయింది. ప్ర‌స్తుతానికి కోలుకుంది. జ‌బ్బు నుంచి సంపూర్ణ ఆరోగ్య వంతురాలిగా  త‌యారైంది.  సంక్రాంతి త‌ర్వాత య‌ధావిధిగా మ‌ళ్లీ షూటింగ్ ల‌కు హాజ‌రు కానుంది. అయితే స‌మంత ఇలా కోలుకుందో లేదో...తాజాగా మరో  హీరోయిన్ జ‌బ్బు బారిన ప‌డిట‌న‌ట్లు ప్రచారం సాగుతోంది.

ఆ బ్యూటీ ఇటీవ‌లే రన్‌అవే అనే  హిట్ సినిమాతో అరంగేట్రం చేసింది. ఇందులో అమ్మ‌డు  షాకింగ్ క్లైమాక్స్ స‌న్నివేశాల‌తో యువ‌త‌ని బాగా  ఆకర్షించింది.  అమ్మ‌డి స్కిన్ షోతోనూ చెల‌రేగింది. హాట్ పెర్పార్మెన్స్ కి  వెనుకాడనందున కుర్రాళ్ల‌లో ఫాలోయింగ్ పెరిగింది.  అలాగే  ఓ ప్రముఖ వ్యక్తితో  హెవీ హార్డ్ సన్నివేశాల్లోనూ న‌టించింది. అయితే ఈ బ్యూటీ
హఠాత్తుగా తను భాగమైన షూట్లన్నీ  క్యాన్సిల్ చేసుకోవడం ప్రారంభించిందని మీడియాలో  కథనాలు వస్తున్నాయి.

న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా  డిసెంబర్‌లో కొన్ని ఈవెంట్‌లకు క‌మిట్ అయింది. కానీ ఇప్పుడా డేట్లు మొత్తం ర‌ద్దు చేస్తుందిట‌. ఎలాంటి ఈవెంట్లు చేయ‌బోడం  లేద‌ని..కొన్నాళ్ల పాటు విశ్రాంతి కావాల‌ని అంద‌రికీ దూరంగా ఉంటుందిట‌. తీసుకున్న అడ్వాన్సులు తిరిగి ఇచ్చేయ‌మ‌ని త‌న పైనాన్స్  మేనేజ‌ర్ల‌కు సూచించిదిట‌.  కార‌ణాలు ఏంటా? అని ఆరాతీస్తే
ఆమె అనారోగ్యంతో బాధపడుతోందని  ఆమె స‌న్నిహిత వ‌ర్గాల ద్వారా తెలిసింది.

అయితే అనారోగ్యం నుంచి  20 రోజుల్లో కోలుకునే అవకాశం ఉందిట‌. జనవరి మూడ‌వ  వారంలో మ‌ళ్లీ య‌థావిధిగా షెడ్యూల్ ఉంటుంద‌ని స‌మాచారం. అనారోగ్యం అంటే అదేమి తీవ్రమైన సమస్య కాదు. వైరల్ ఫీవర్ వచ్చిందని అంటున్నారు. అయితే ఇండియాలోకి క‌రోనా కొత్త వేరియంటెంట్ ఓమిక్రాన్ బిఎఫ్ -7 రావ‌డంతో? అలాంటి వైర‌స్ ఏదైనా సోకిందా? అన్న సందేహాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. ఇంతకుముందు కూడా ఆమె కొన్ని సినిమాల సెట్స్ నుండి బయటకు వెళ్లి  వారం - రెండు వారాల తర్వాత మ‌ళ్లీ  తిరిగి జాయిన్ అయ్యేది. అయితే ఈసారి బాగా ఆల‌స్య‌మ‌వ్వ‌డంతోనే విష‌యం ఇలా స్ర్పెడ్ అవుతుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News