అను ఇమ్మాన్యుయేల్.. ఈ అందాల సోయగం గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఆకట్టుకునే అందం, అంతకుమించిన టాలెంట్ ఈ భామ సొంతం. స్కిన్ షోకు ఎలాంటి బౌండరీలు పెట్టుకోలేదు. పైగా స్టార్ హీరోల సరసన ఆడి పాడింది. అయినా సరే అను కెరీర్ ఆరంభం నుంచి ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయింది. ఈ క్రమంలోనే ఐరన్ లెగ్ అనే ముద్రను వేయించుకుంది.
ఇక కెరీర్ క్లోజ్ అనుకుంటున్న తరుణంలో ఈ బ్యూటీ.. రీసెంట్‌గా 'ఊర్వశివో రాక్షసివో' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. అల్లు శిరీష్ హీరోగా రాకేష్ శశి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ఇది. అల్లు అరవింద్ సమర్పణలో శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై ధీరజ్ మొగిలినేని ఈ సినిమాను నిర్మించారు.
నవంబర్ 4 న థియేటర్స్ లోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా యూత్ ఈ మూవీకి బాగా ఎట్రాక్ట్ అయ్యారు. ఇందులో సింధూజ పాత్రలో అను అదరగొట్టేసింది. లిప్ లాక్ సన్నివేశాలు, ఇంటిమేట్ సీన్స్ లో మొహమాటపడకుండా నటించి విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది.
ఈ మూవీ తో ఎట్టకేలకు హిట్టు కొట్టి అను ఫుల్ జోష్ లోకి వచ్చింది. ఇదే జోష్ లో ఓ బంపర్ ఆఫర్ ను కొట్టేసింది. విభిన్నమైన చిత్రాలతో కోలీవుడ్ లో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న హీరో కార్తి.. ఇటీవల 'సర్దార్' తో ప్రేక్షకులను పలకరించి సూపర్ డూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన తన తదుపరి చిత్రాన్ని రాజు మురుగన్ దర్శకత్వంలో చేయబోతున్నాడు.
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితం కాబోతోంది. కార్తి కెరీర్ లో 25వ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'జపాన్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. అయితే ఈ సినిమాలో కార్తికి జోడిగా నటించే అద్భుత అవకాశాన్ని అను ఇమ్మాన్యుయేల్ అందుకుంది. అవును, మంగళవారం ఈ సినిమా చెన్నైలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.
ఈ కార్యక్రమంలో అను ఇమ్మాన్యుయేల్ కూడా పాల్గొనడంతో.. ఆమె ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతోందని కన్ఫార్మ్ అయింది. దీంతో 'ఊర్వశివో రాక్షసివో' అందించిన హిట్ తో అను దశ తిరిగిందని, ఇక ఇప్పుడు 'జపాన్' సినిమా కూడా మంచి విజయం సాధిస్తే ఆమెను ఎవరు ఆపలేరని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి అను ఇదే ఊపుతో కెరీర్ ను సక్సెస్ ఫుల్‌గా ముందుకు సాగిస్తుందా..? లేదా..? అన్నది చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.