టాలీవుడ్ లో నంబర్ గేమ్ హిడెన్ గా రన్ అవుతోందా? అంటే అవుననే అర్థమవుతోంది. స్టార్ హీరోల నడుమ ఈ పోటీ బలంగానే రన్ అవుతోంది. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ గా తెలివైన ఎంపికలతో దూసుకుపోతున్న ప్రభాస్ ని ఛేజ్ చేసేందుకు ఇతర స్టార్ హీరోలు ఎవరికి వారు ప్రయత్నాల్లో ఉన్నారన్నది అందరూ అంగీకరించే నిజం.
మగధీరగా కెరీర్ ఆరంభమే సంచలనాలు సృష్టించిన చరణ్ లో కాంపిటీటివ్ స్పిరిట్ మరీ ఎక్కువ అని సన్నిహితులు చెబుతారు. ఇప్పుడు ప్రభాస్ కి ధీటుగా అతడి ప్రణాళికలు సాగుతున్నాయి. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళితో ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా చిత్రాన్ని ప్లాన్ చేసిన చరణ్ తదుపరి రోబో శంకర్ దర్శకత్వంలో నటిస్తూ జాతీయ మీగియా అటెన్షన్ ని గ్రాబ్ చేసాడు. ఈ ప్రాజెక్ట్ ఇండియా లెవల్లో ఒక సంచలనం కానుంది.
ఆ తర్వాత కూడా చరణ్ పలువురు క్రేజీ పాన్ ఇండియా దర్శకుల్ని లాక్ చేసేందుకు ఇప్పటినుంచే అడ్వాన్స్ డ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ప్రముఖంగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ పేరు వినిపిస్తోంది. అతడు ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ తోనే మరో ప్రాజెక్టుకు కమిటైన ప్రశాంత్ నీల్ ని రామ్ చరణ్ బృందం లాక్ చేయాలని సన్నాహకాల్లో ఉంది.
RRR నిర్మాత డివివి దానయ్య ఈ సినిమాని నిర్మిస్తారని కూడా ప్రచారం సాగుతోంది. చరణ్ -ప్రశాంత్ కలయికలో దానయ్య భారీ ప్రాజెక్ట్ కోసం జతకడుతారనే ఊహాగానాలు సాగుతున్నాయి. ఇటీవల మెగా ఫ్యామిలీ నివాసంలో మెగాస్టార్ చిరంజీవితో చరణ్- ప్రశాంత్ నీల్ కలిసి పోజులిచ్చిన ఫోటో ఇంటర్నెట్ లో పెద్ద సంచలనం సృష్టించింది. ఆ ఇద్దరి కలయికా నిజమా కాదా? అని సందేహాలు ఉన్నవారికి అన్నిటినీ పటాపంచలు చేస్తూ చరణ్ స్వయంగా ఇప్పుడు హింట్ ఇచ్చేశారు.
తాజాగా `నాట్యం` మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో ప్రశాంత్ నీల్ తో రూమర్ పై ఆసక్తికరమైన ప్రకటన చేశాడు. నిజంగానే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారా? అని మీడియా ప్రశ్నించగా.. చరణ్ ఇలా అన్నాడు. ``మేం ఇప్పుడే భోజనం చేసాం. అన్నింటినీ తగిన సమయంలో ప్రకటిస్తాం`` అని అన్నారు. అంటే లంచ్ అయ్యాక ఇంకా మీటింగులు ఉన్నాయని కథా చర్చలు సాగుతాయని దీనర్థం. కొనసాగుతున్న ఊహాగానాలను చరణ్ ఖండించలేదు. అనధికారికంగా ప్రశాంత్ నీల్ తో ప్రాజెక్ట్‌ను ధృవీకరించారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళుతుందని అంచనా వేస్తున్నారు. ఈలోగా ప్రశాంత్ నీల్ బౌండ్ స్క్రిప్ట్ ని లాక్ చేయాల్సి ఉంటుంది.
శంకర్ పై ఒత్తిడి పెంచుతున్న చరణ్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సినిమా ప్రారంభోత్సవం జరిగింది. రెగ్యులర్ షూటింగ్ ని పరుగులు పెట్టించాలన్నది ప్లాన్. చెర్రీ కూడా శంకర్ సినిమాకు సంబంధించిన వర్క్స్ లో తలమునకలై ఉన్నారు. ఈ సినిమాని శరవేగంగా పూర్తిచేయాలని శంకర్ ని దిల్ రాజు బృందం కోరారని తెలిసింది. అందుకే స్టార్ మేకర్ గత చిత్రాల్లా కాకుండా వీలైంనత త్వరగా షూటింగ్ సహా అన్ని పనులు పూర్తిచేసి రిలీజ్ చేయాలని భావిస్తున్నారుట.
దీనిలో భాగంగా టీమ్ ని చాలా పకడ్భందీగా డిజైన్ చేసి అప్రమత్తం చేసినట్లు సమాచారం. కేవలం టాకీ పార్టునే మూడు నెలల్లో ఎట్టిపరిస్థితుల్లో పూర్తిచేస్తారు. అయితే చిత్రీకరణ ఎక్కువ భాగం ఎక్కడ జరుగుతుందన్న వివరాలు వెల్లడించాల్సి ఉంది. శంకర్ సినిమాలు సాధారణంగా సుదీర్ఘ కాలం షూటింగ్ జరుగుతుంది. ఆ రకంగా అతని వద్ద ఉన్న ప్రస్తుత టీమ్ ని ఒక్కసారిగా స్పీడప్ చేయడం అంటే చిన్న విషయం కాదు. కానీ ప్రణాళిక ఈసారి స్పీడ్ గా ఉందని ఇప్పటికే కథనాలొచ్చాయి. ఇక ఇందులో ఓ కీలక పాత్రలో తమిళ నటుడు ప్రభు పోసిస్తున్నట్లు సమాచారం. అలాగే కన్నడ నటుడు కిచ్చా సుదీప్ అతిధి పాత్రలో కనిపించనున్నట్లు తెలిసింది. ఇలా సౌత్ లో ఫేమస్ అయిన నటుల్ని శంకర్ - చరణ్ ప్రాజెక్ట్ లో భాగం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో చరణ్ కి జోడీగా కియారా అద్వాణీ నటిస్తోన్న సంగతి తెలిసిందే. శంకర్ తో ప్రాజెక్ట్ ని వేగంగా ముగిస్తే తదుపరి కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ తోనే చరణ్ సినిమా చేసే అవకాశాలు ఎక్కువ.