విక్రమ్‌ కి ఈ సినిమానైనా హిట్‌ ఇచ్చేనా...!

Update: 2022-07-22 02:30 GMT
తమిళంతో పాటు ఒకప్పుడు తెలుగులో కూడా భారీ విజయాలను సొంతం చేసుకుని సౌత్‌ లోనే స్టార్‌ గా పేరు దక్కించుకున్న విక్రమ్‌ గతమెంతో ఘనం అన్నట్లుగా పరిస్థితి మారింది. ఒకప్పుడు భారీ విజయాలను దక్కించుకున్న విక్రమ్‌ ఇప్పుడు సక్సెస్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. క్రమం తప్పకుండా ఈయన తమిళంలో సినిమాలను విడుదల చేస్తూనే ఉన్నాడు.

అక్కడ ఒకటి రెండు పర్వాలేదు అనిపించుకుంటున్నా.. తెలుగు ప్రేక్షకులు విక్రమ్‌ ను దాదాపుగా మర్చిపోయినట్లే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అపరిచితుడు హీరో అంటూనే ఇంకా కూడా విక్రమ్‌ ను పరిచయం చేయాల్సిన పరిస్థితి ఉంది అంటే ఈమద్య కాలంలో వచ్చిన ఆయన సినిమా లు ఏ రేంజ్ లో ప్లాప్‌ అయ్యాయో అర్థం చేసుకోవచ్చు.

ఇలాంటి సమయంలో కోబ్రా సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తమిళనాట ఈ సినిమా పై ఏవో కారణాల వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం కోబ్రా సినిమా గురించి కనీసం సినీ జనాలు కూడా పెద్దగా పట్టించుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇది మరో అపరిచితుడు సినిమా అన్నట్లుగా మేకర్స్‌ భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు.

విభిన్నమైన గెటప్స్ లో విక్రమ్‌ కనిపించబోతున్నాడు. తెలుగు లో భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆగస్టు 11న సినిమాను విడుదల చేయాలని భావించినా కూడా కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్ పెండ్డింగ్‌ లో ఉందట. కనుక ఆగస్టు 31న సినిమాను విడుదల చేసేందుకు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

కోబ్రా సినిమా పై ఇప్పటికే పెద్దగా బజ్ లేదు. ఈ సమయంలో సినిమా ను మళ్లీ మళ్లీ వాయిదా వేయడం తో ఆసక్తి మరింతగా సన్నగిల్లుతుందని.. సినిమా చూడాలనే ఉత్సాహం కూడా తగ్గుతుందనే కామెంట్స్ వస్తున్నాయి.

సినిమా కు ఎలాగూ బజ్ లేదు.. కనుక మినిమంగా ఉన్నా కూడా కచ్చితంగా ప్రేక్షకులు హిట్‌ గానే భావిస్తారు. కనుక ఈ సినిమా తో అయినా విక్రమ్‌ సక్సెస్‌ అయ్యేనా చూడాలి.
Tags:    

Similar News