టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకోవాలని లైగర్ సినిమాతో చాలా కష్టపడ్డాడు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. డిజాస్టర్ కావడమే కాకుండా పలు ఆర్థిక ఆరోపణల వివాదాలలో కూడా చిక్కుకోవాల్సి వచ్చింది. ఆఖరికి విజయ్ కూడా విచారణలో పాల్గొనడం కొత్త ఆశ్చర్యాన్ని కూడా కలిగించింది.
అయితే ఆ సినిమా తర్వాత విజయ్ ఒక పవర్ఫుల్ సక్సెస్ అయితే అందుకోవాల్సి ఉంది. ప్రస్తుతం అతని ఫోకస్ ఖుషి సినిమాపై ఎక్కువగా ఉంది. శివ నిర్వణ దర్శకత్వంలో తెరపైకి వస్తున్న ఈ సినిమాలో సమంతా కథానాయకగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఖుషి సినిమాకు సంబంధించి రిలీజ్ విషయంలో ఇటీవల చిత్ర యూనిట్ సభ్యులు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
అసలైతే మొదట ఈ సినిమాను గత ఏడాది డిసెంబర్లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ సమంత అనుకోకుండా అనారోగ్య కారణాలతో బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది.
ఇక ఫిబ్రవరిలో అయినా ఖుషి సినిమాను విడుదల చేయాలని అనుకున్నప్పటికీ కూడా షూటింగ్ మళ్లీ ఇంకా మొదలు కాలేదు. ఈ క్రమంలో వీలైనంత త్వరగా మిగిలిన షూటింగ్ ను మొత్తం పూర్తిచేసి సినిమాను మే నెలలో విడుదల చేయాలని ఫోకస్ పెడుతున్నట్లుగా తెలుస్తోంది.
ఏప్రిల్ లో విడుదల చేయవచ్చు కానీ ఆ సమయంలో కొన్ని పెద్ద సినిమాలు నుంచి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. అసలే ఖుషి సినిమా తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో కూడా విడుదలవుతోంది.
కాబట్టి పోటీ తక్కువగా ఉన్న సమయంలోనే గ్రాండ్ గా విడుదల చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. అలాగే వినయ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.