హాలీవుడ్ లో సినిమాలు చేయాలని, ఆస్కార్ అవార్డులు అందుకోవాలని ఆశపడని స్టార్ అంటూ వుండరు. మన ఇండియన్ స్టార్లలో చాలా మంది కనీసం ఆస్కార్ కు అయినా నామినేట్ కావడానలి, ఆ వేడుకల్లో పాల్గొనాలని, హాలీవుడ్ సినిమాల్లో నటించాలని ఆశపడుతూ వుంటారు. ఆస్కార్ కు నామినేట్ కాలేకపోయినా హాలీవుడ్ సినిమాల్లో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు తమిళ హీరో ధనుష్. తండ్రి కాస్తూరి రాజా దర్శకుడు కావడంతో ధనుష్ 'తుల్లుదవో ఇలమై' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
ఆ తరువాత సోదరుడు సెల్వరాఘవన్ దర్శకుడిగా మారడంతో 'కాదల్ కొండేన్' సినిమాతో నటుడిగా నతనలోని కొత్త కోణాన్ని పరిచయం చేసి శభాష్ అనిపించుకున్నాడు. అక్కడి నుంచి ఈ ఇరవై ఏళ్ల ప్రయాణంలో ఇంతింతై వటుడింతై అన్నచందంగా తమిళనాట తిరుగులేని హీరోగా పేరు తెచ్చుకున్నాడు. కోలీవుడ్ నుంచి రజనీ తరువాత ఇతర దేశాల్లో యమ క్రేజ్ వున్న హీరోగా గుర్తింపుని సొంతం చేసుకున్నాడు.
'రాన్ జానా' సినిమాతో బాలీవుడ్ లోనూ సత్తాచాటిన ధనుష్ వైదిల్ కొలవెరి తో వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తమిళంలో వున్న స్టార్ హీరోల్లో ప్రత్యేకతను సొంతం చేసుకున్న ధనుష్ 'ద ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్' సినిమాతో హాలీవుడ్ బాట పట్టాడు. 2018లో ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతూ వచ్చి మొత్తానికి 2019లో విడుదలైంది. అయితే ధనుష్ కు ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది.
తాజాగా హాలీవుడ్ లో మరో సినిమా చేస్తున్నాడు ధనుష్. 'ది గ్రే మ్యాన్' పేరుతో రూపొందుతున్న ఈ మూవీని 'అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్', అవెంజర్స్ ఎండ్ గేమ్', కెప్టెన్ అమెరికా, వింటర్ సోల్జర్ వంటి సినిమాల దర్శకుడు ఆంటోనీ రుస్సో రూపొందించాడు. ర్యాన్ గోస్లింగ్, క్రిస్ ఎవాన్స్, అన దే ఆర్మస్, జెస్సిక హెన్విక్ వంటి హాలీవుడ్ స్టార్స్ తో కలిసి ఈ మూవీలో ధనుష్ నటించాడు. 200 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీని జూలై 22న విడుదల చేయబోతున్నారు.
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్న ఈ మూవీ ప్రీమియర్స్ ని యుఎస్ లో ఏర్పాటు చేశారు. దీనికి హీరో ధనుష్ తన ఇద్దరు తనయులతో కలిసి హాజరయ్యాడు. అయితే ఈ మూవీ టాక్ ఏమంత బాగాలేదని తెలుస్తోంది. ఇది ధనుష్ కు బిగ్ షాక్ అని చెబుతున్నారు.
హాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాల్లో నటించే అవకాశం లభించినా అది ఆశించిన విజయాన్ని సాధించకపోవడం గమనార్హం. అంతే కాకుండా ఈ మూవీలో ధనుకు ఇచ్చిన ప్రాధాన్యత అంతంత మాత్రమే. దీంతో ఈ మూవీ రివ్యూల్లో అతని ప్రస్థావనే ఎవరూ తీసుకురాలేదట. దీంతో ధనుష్ ఫ్యాన్స్ తో పాటు కోలీవుడ్ వర్గాలు కూడా షాక్ కు గురవుతున్నాయి.