కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తొలిసారి తెలుగు దర్శకనిర్మాతలతో కలిసి భారీ మూవీని చేస్తున్న విషయం తెలిసిందే. తమిళంలో `వారీసు`గా రూపొందుతున్న ఈ మూవీని తెలుగులో `వారసుడు`గా విడుదల చేయబోతున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, ఆయన సోదరుడు శిరీష్ సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ స్టార్ కాస్టింగ్‌తో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
నేషనల్ క్రిష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్నఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటూ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగడానికి రెడీ అవుతోంది. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం 'రంజితమే' అనే ఫస్ట్ సింగిల్ సాంగ్ ప్రోమోని విడుదల చేస్తూ ప్రమోషన్స్ కు శ్రీకారం చుట్టారు. తమిళ వెర్షన్ ని పొంగల్ కి అంటే జనవరి 12న రిలీజ్ చేస్తున్న మేకర్స్ అదే తేదీన తెలుగు డబ్బింగ్ వెర్షన్ `వారసుడు`ని విడుదల చేయబోతున్నారు.
హిందీలోనూ ఈ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి సన్నిహాలు జరుగుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇంత వరకు బాగానే వుంది. అయితే ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ అనుసరిస్తున్న విధానమే ఫ్యాన్స్ కి పెద్దగా నచ్చడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి 'రంజితమే' అనే ఫస్ట్ సింగిల్ వరకు తమిళ వెర్షన్ కే మేకర్స్ తొలి ప్రధాన్యత ఇవ్వడం, తెలుగు వెర్షన్ ని అంతగా పట్టించుకోకపోవడం ఏమీ బాగాలేదని, మీ స్ట్రాటజీ ఉంటో అర్థం కావడం లేదని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారట.
అంతే కాకుండా తెలుగులో ప్రమోషన్స్ ని మొదలు పెట్టండి అంటూ మేకర్స్ ని విజయ్ తెలుగు రాష్ట్రాల అభిమానులు రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే మేకర్స్ ముందు తమిళ వెర్షన్ కే తొలి ప్రాధాన్యతనివ్వడం వెనక హీరో విజయ్ కండీషన్ వుందని తెలుస్తోంది. వంశీ పైడిపల్లితో తను చేస్తున్న సినిమాని ముందు నుంచి తమిళ సినిమాగానే ప్రొజెక్ట్ చేయమని చెబుతున్నాడట. ఆ కారణంగానే ఇది బైలింగ్వల్ మూవీ కాదని ఇటీవల దిల్ రాజు ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇది తమిళ సినిమా కాబట్టి ప్రమోషన్స్ నుంచి ప్రతీదీ తమిళ్ కే ప్రధాన్యత నివ్వాలని విజయ్ ముందే సూచించాడని, తన కండీషన్ ని దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజు అంగీకరించారు కాబట్టే టైటిల్ అనౌన్స్ మెంట్ దగ్గరి నుంచి అదే ఫాలో అవుతున్నారట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.