పుష్పరాజ్ గట్ పవర్ ముందు ఇంకేదీ నిలబడదు. ఎదుట ఉన్నది ఎంత పెద్ద మొనగాడైనా చిత్తడి అయిపోద్ది. మంగళం శీనుకే మాడు పగిలిపోయింది. ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ (ఫహద్ ఫాజిల్) ఒంటిపై గుడ్డలూడదీసి మరీ తన్నాడు. అలాంటిది ఇప్పుడు బాలీ అర్జున్ అతడి ముందు నిలబడతాడా?.. ప్రస్తుతం ఫిలింనగర్ వర్గాల్లో చర్చ ఇది.
గత కొంతకాలంగా పుష్ప 2 పై రకరకాల రూమర్లు షికార్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా తమిళం నుంచి విజయ్ సేతుపతిని విలన్ పాత్రకు ఎంపిక చేసారని .. భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర చనిపోయాక ఈ పాత్ర ఎంటరవుతుందని కూడా గుసగుసలు వినిపించాయి.
ఇప్పుడు లేటెస్టుగా బాలీ అర్జున్ ఆ పాత్రలో ప్రవేశిస్తాడని సేతుపతిని సంప్రదించలేదని కూడా గుసగుసలు మొదలయ్యాయి. అయితే ఇందులో ఏది నిజం? అని ఆరా తీస్తే అసలు బాలీవుడ్ యువహీరో బోనీ తనయుడు అర్జున్ కపూర్ ని ఎవరూ సంప్రదించిందే లేదట. అయినా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముందు బాలీ అర్జున్ నిలబడతాడా? అన్న ప్రశ్న ఎదురైంది. పవర్ ప్యాక్డ్ ఎనర్జీ హౌస్ ముందు కరెంటు తీగలా కనిపిస్తే ఎలా కుదురుతుంది? అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ సెకండ్ పార్ట్ లో ఫహద్ ఫాజిల్ పాత్ర చనిపోతే అంతకుమించి ధీటుగా ఎనర్జిటిక్ గా నటించే మరో స్టార్ ని ఎంపిక చేయాల్సి ఉంటుందని నెటిజనులు సూచిస్తున్నారు. సుకుమార్ అండ్ టీమ్ మైండ్ లో ఏం ఆలోచన ఉందో చూడాలి.
పుష్ప చిత్రం తెలుగు తమిళంతో పాటు హిందీలోనూ అద్భుతంగా ఆడింది. ఇటీవలి కాలంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచినప్పటి నుండి హిందీ ప్రజలు సీక్వెల్ కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు. అదే క్రమంలో సుకుమార్ బాలీవుడ్ స్టార్లను వెతుకుతున్నారన్న పుకార్లు షికార్ చేస్తున్నాయి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ స్క్రిప్ట్ ని పూర్తి చేయడానికి చాలా సమయం తీసుకున్నాడు. చివరకు షూటింగ్ కి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ ఈ చిత్రంలో భాగమయ్యాడని పుకారు మొదలైంది.
ఇంటర్వెల్ కి ఫహద్ ఫాజిల్ పాత్ర చనిపోతుందని ఆపై సినిమా సెకండాఫ్ లో అర్జున్ కపూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరిస్తాడని ప్రచారం సాగుతోంది. కానీ ఇందులో నిజం ఏదీ లేదని చిత్రబృందం చెబుతోందని కథనాలొస్తున్నాయి.
సీక్వెల్ కోసం అదిరిపోయే ఐటమ్ నంబర్ ని సుకుమార్- దేవీశ్రీ బృందం ప్లాన్ చేస్తున్నారు. దిశా పటానీ లేదా వారినా హుసేన్ ఈ ఐటమ్ నంబర్ లో నర్తించే వీలుందని సమాచారం. పుష్పలో ఊ అంటావా సాంగ్ ని కొట్టే రేంజులో దేవీశ్రీ మాసీ పెప్పీ నంబర్ ని రెడీ చేస్తున్నాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.