ఈ మధ్య స్టార్ హీరోలు నటించిన సినిమాలు భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్స్ గా నిలుస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతున్నాయి. క్రేజీ హీరోలు నటించిన సినిమాల్లో కొన్ని అంచనాలకు మించి బిజినెస్ కావడం..మార్కెట్ తో సంబంధం లేకుండా భారీ మొత్తాలకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మడం.. ఆ తరువాత అవి ఆశించిన స్థాయిలో బ్రేక్ ఈవెన్ ని సాధించలేక పెట్టిన పెట్టుబడిని కూడా తిరిగి రాబట్టలేకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లకు మేకర్స్ కి మధ్య సరికొత్త వివిదాలు తలెత్తడం ఆనవాయిదీగా మారుతూ వస్తోంది.
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఆచార్య' మూవీ మేకర్స్ పై కూడా ఇదే తరహాలో డిస్ట్రిబ్యూటర్స్ విరుచుకుపడిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తొలిసారి కలిసి నటించిన మూవీ ఇది. కెరీర్ లో అపజయమెరుగని దర్శకుడిగా పేరున్న కొరటాల శివ ఈ మూవీని తెరకెక్కించాడు.
ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించిన సినిమా కావడంతో ఈ మూవీని డిస్ట్రిబ్యూటర్లకు భారీ మొత్తాలని అమ్మేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలని తెచ్చి పెట్టింది.
సినిమా బాధ్యతల్ని దర్శకుడు కొరటాల శివ నెత్తికెత్తుకోవడంతో డిస్ట్రిబ్యూటర్లు అతని వెంలపడటం మొదలు పెట్టారు. దీంతో చాలా వరకు తనే 'ఆచార్య' నష్టాలని భర్తీ చేయడం మొదలు పెట్టాడు.. ఇప్పటికీ కొంత మందికి రికవరీ చేయాల్సి వుందనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మరో సినిమా టీమ్ కూడా ఇదే తరహా పరిస్థితుల్ని ఎదుక్కోబోతోందని తెలుస్తోంది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ మూవీ 'లైగర్'.
పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఛార్మీతో కలిసి బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ నిర్మించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా మూవీగా విడుదలై భారీ డిజాస్టర్ అనిపించుకుని షాకిచ్చింది. మూడేళ్ల పాటు హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ పడిన కష్టం అంతా వృధా అయిపోయింది. ఈ మూవీని కూడా మేకర్స్ భారీ మొత్తాలని డిస్ట్రిబ్యూటర్లకు కట్టబెట్టారు. అయితే ఆ స్థాయిలో ఈ మూవీ వసూళ్లని రాబట్టలేక డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలని తెచ్చిపెట్టింది.
గత కొన్ని రోజులుగా రికవరీ కోసం పూరీ జగన్నాథ్ చుట్టూ డిస్ట్రిబ్యూటర్లు తిరుగుతున్నారు. జీఎస్టీని మాత్రం భరించిన పూరి నష్టాల విషయంలో మాత్రం ఇంత వరకు పెదవి విప్పలేదట. దీంతో 'లైగర్' డిస్ట్రిబ్యూటర్లు అంతా కలిసి తదుపరి కార్యచరణ కోసం రెడీ అవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. పూరి సమస్యపై హామీ ఇవ్వకుంటే డిస్ట్రిబ్యూటర్లు రచ్చ కెక్కాలనే ఆలోచనలో వున్నట్టుగా ఇన్ సైడ్ టాక్. అదే జరిగితే టాలీవుడ్ లో 'లైగర్' మరోసారి హాట్ టాపిక్‌గా మారడం ఖాయం అని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.