గత ఏడాది ఆరంభం నుండి నాగచైతన్య లవ్ స్టోరీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. గత ఏడాది సమ్మర్ లో సినిమాను విడుదల చేయాలని చివరి దశ షూటింగ్ చేస్తూ ఉన్న సమయంలో కరోనా లాక్ డౌన్ కారణంగా నిరవదికంగా వాయిదా వేయడం జరిగింది. ఈ ఏడాదిలో సినిమాను విడుదల చేసేందుకు కొత్త తేదీని కూడా ప్రకటించారు. మళ్లీ సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా వేయడం జరిగింది. మొత్తానికి లవ్ స్టోరీ సినిమా ఈ ఏడాదిలో విడుదల అవుతుందా లేదా అని అనుమానాలు వ్యక్తం చేస్తూ.. ఓటీటీకి ఇస్తారా ఏంటీ అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో నిర్మాతలు స్పందించి థియేటర్లు పూర్తి స్థాయిలో ఓపెన్ అయ్యాక ఖచ్చితంగా థియేటర్ లోనే విడుదల చేస్తామని ప్రకటించారు.
గత నెల చివరి నుండే థియేటర్లు ఓపెన్ అయ్యాయి. కాని ఆడియన్స్ రాక విషయమై సస్పెన్స్ కొనసాగింది. మొదటి వారం ఆశించినంతగా అభిమానులు రాలేదు. కాని తదుపరి వారం నుండి మంచి వసూళ్లను కొత్త సినిమాలు దక్కించుకుంటున్నాయి. కనుక బ్యాక్ టు బ్యాక్ వచ్చే వారం నుండి సినిమాలు రాబోతున్నాయి. ఈ నెల మొత్తం చిన్న సినిమాలతో థియేటర్లు నిండి పోతున్నాయి. కనుక సెప్టెంబర్ లో చైతూ.. సాయి పల్లవిల లవ్ స్టోరీని విడుదల చేస్తారనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఇండస్ట్రీ వర్గాల్లో మరియు మీడియా సర్కిల్స్ లో సినిమాను సెప్టెంబర్ లో విడుదల చేయబోతున్నట్లుగా ప్రచారం జరిగింది.
అన్నట్లుగానే సెప్టెంబర్ లో సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా యూనిట్ సభ్యుల నుండి అనధికారికంగా క్లారిటీ వచ్చేసింది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే సెప్టెంబర్ 10వ తారీకున విడుదల చేయాలని భావిస్తున్నారు. ఒక్కటి రెండు రోజుల్లోనే కొత్త విడుదల తేదీతో కొత్త పోస్టర్ ను విడుదల చేస్తారని తెలుస్తోంది. నాగచైతన్య లవ్ స్టోరీని ముగించి థ్యాంక్యూ ను కూడా పూర్తి చేశాడు. ఈ రెండు సినిమాలపై కూడా అక్కినేని అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఫిదా వంటి బిగ్గెస్ట్ సక్సెస్ తర్వాత లవ్ స్టోరీతో దర్శకుడు శేఖర్ కమ్ముల రాబోతున్నాడు.