బంగారు బాతును పట్టిందంటూ సుష్ పై పంచ్ లు!

Update: 2022-07-18 01:30 GMT
అందాల క‌థానాయిక‌.. మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్.. ఐపీఎల్ సృష్టిక‌ర్త‌.. వ్యాపారవేత్త లలిత్ మోడీ తో సంబంధాన్ని బహిరంగంగా ప్ర‌క‌టించిన తర్వాత నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. పలువురు సెలబ్రిటీలు అభిమానులు సోషల్ మీడియాలో వారిని అభినందించగా.. చాలా మంది విమ‌ర్శ‌నాస్త్రాల్ని ఎక్కుపెడుతున్నారు. సుష్‌ నిర్ణయానికి వ్య‌తిరేకంగా ట్రోలర్స్ చెల‌రేగుతున్నారు. ఈ జంట‌పై మీమ్ లు జోకులు పేలుతూనే ఉన్నాయి. చాలా మంది `అతని డబ్బు కోసం` ప్రేమ‌లో ప‌డిందని.. సుష్‌ `బంగారు బాతును` ప‌ట్టింద‌ని కూడా ట్రోల్ చేస్తున్నారు. వేల కోట్ల ఆస్తిప‌రుడైన ల‌లిత్ మోడీ కోర‌గానే డేటింగ్ కి సిద్ధ‌మైంద‌ని విమ‌ర్శిస్తున్నారు.

లలిత్ మోడీతో డేటింగ్ ప్రారంభించిన సుష్ ని `గోల్డ్ డిగ్గర్` అని ట్రోల్ చేయడంపై సుస్మిత తాజాగా స్పందించింది. ``ది ప్రాబ్లమాటిక్ కల్చర్ ఆఫ్ కాలింగ్ ఉమెన్ గోల్డ్ డిగ్గర్స్`` అనే శీర్షికతో ఒక కథనాన్ని షేర్ చేస్తూ.. సుస్మితా సేన్ ప‌లు ఈమోజీల‌ను షేర్ చేసింది. హృదయం- కౌగిలింత- థంబ్స్ అప్ .. ముడుచుకున్న చేతులు ఎమోజీలను జోడించింది. ఆమె తన ట్వీట్ లో `ఎ సెల్ఫ్ మేడ్ ఉమెన్` అనే హ్యాష్ ట్యాగ్ ను జ‌త చేసింది. డేటింగ్ ఎంపికలు నిరంతరం వివరించలేని విధంగా బహిరంగ చర్చకు సంబంధించినవిగా మారాయి! అని మరొక ట్వీట్ లో న‌ర్మ‌గ‌ర్భంగా పేర్కొంది సుస్మిత‌.

సుస్మిత ఇన్ స్టాగ్రామ్ లో తన మాల్దీవుల వెకేషన్ నుండి కొత్త ఫోటోతో పాటు `నాయిస్ క్యాన్సిలేషన్ పవర్` గురించి మాట్లాడుతూ ఒక రహస్య నోట్ ని రాసింది. ఒక అద్భుతమైన ఫోటోతో పాటు ఆమె ఇలా రాసింది, ``ఆహ్ సెరినిటీ అండ్ ది పవర్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్!!! అన్న వ్యాఖ్య‌తో పాటు గుండె కళ్ళు-నవ్వు- ఎరుపు గుండె- మ్యూజిక్ ఎమోజీలను షేర్ చేసింది.  తన క్యాప్షన్ తో సుస్మిత తన రిలేషన్ షిప్ ఎంపికలను విమర్శించినందుకు పరోక్షంగా ట్రోల‌ర్ల‌ను తిప్పికొట్టింది.

సుస్మిత‌తో డేటింగ్ కి ముందు లలిత్ మోడీ గతంలో మినాల్ సగ్రానీని వివాహం చేసుకున్నారు. అక్టోబర్ 1991లో ఈ జంట వివాహం జ‌రిగింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు - కొడుకు రుచిర్ .. కుమార్తె అలియా. మినాల్ మొదటి వివాహం నుండి కరీమా సగ్రానీకి త‌ల్లిగా ఉన్నారు. క‌రీమాకు లలిత్ సవతి తండ్రి. దురదృష్టవశాత్తు మినాల్ 2018లో క్యాన్సర్ తో మృతి చెందారు. సుస్మితా సేన్ అత‌డికి రెండో భార్య కానున్నారు.

మరోవైపు సుస్మిత 2018లో ఇన్ స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన మోడల్ రోహ్ మన్ షాల్ తో రిలేషన్ షిప్ ని సాగించింది. అయితే గత సంవత్సరం అతని నుంచి విడిపోయింది. సుస్మిత‌ రెనీ - అలీసా అనే ఇద్దరు దత్తపుత్రికలకు తల్లి. ఇక‌పై మోడీ భాగ‌స్వామిగా జీవ‌నం సాగించ‌నుంది.
Tags:    

Similar News