‘మా’ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత చోటు చేసుకుంటున్న నాటకీయ పరిణామాల గురించి తెలిసిందే. దీనికి సంబంధించి బోలెడన్ని వార్తలు.. అంతకు మించిన విశ్లేషణలు వస్తున్న వేళ.. వీటికి మించి అన్న రీతిలో ప్రకాశ్ రాజ్ టీం సభ్యులు నిర్వహించిన సుదీర్ఘ ప్రెస్ మీట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారటమే కాదు.. పోలింగ్ వేళ.. పోలింగ్ స్టేషన్ లో అంతలా జరిగిందా? అన్న సందేహాలు వ్యక్తమయ్యేలా వారి మాటలు మారాయి. అంతేకాదు.. సుదీర్ఘంగా సాగిన ప్రెస్ మీట్ కొత్త ఆలోచనలు కలిగేలా చేయటమే కాదు.. మొత్తం ‘మా’ ఎన్నికల వ్యవహారం ఇంతటి రచ్చ వెనుక ఉన్నది ఇద్దరే అన్న విషయాన్ని స్పష్టమయ్యేలా చేసిందని చెప్పాలి.
ప్రకాశ్ రాజ్ ప్యానల్ నిర్వహించిన మీడియా భేటీ సారాంశం ఏమిటి? ప్రెస్ మీట్ చివరకు తేల్చిందేమిటి? రెండు ముక్కల్లో సుదీర్ఘ ప్రెస్ మీట్ సారాంశం చెప్పగలరా? లాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి వస్తే.. మూవీ ఆర్టిస్స్ అసోసియేషన్ ‘మా’కు అసలుసిసలు విలన్లు ఆ ఇద్దరే అన్న విషయాన్ని స్పష్టం చేసింది. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరంటే.. ఒకరు సీనియర్ నటుడు మోహన్ బాబు అయితే.. మరొకరు సీనియర్ నరేశ్.
వారిద్దరి తీరుతోనే ఇంత రభస జరిగిందన్న భావన కలిగేలా ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యుల మాటలు ఉన్నాయని చెప్పక తప్పదు. అంతేకాదు.. ఇంతకాలం మోహన్ బాబు మీద ఏదైనా ఆరోపణలు చేయాలన్నా.. విమర్శ చేయాలన్న ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారన్న మాట వినిపిస్తూ ఉండేది. తాజాగా ఆ ఫీలింగ్ ను పక్కన పెట్టేసి.. ఏది ఏమైనా సరే.. మనసుకు అనిపించింది చెప్పేయాలంతే అన్నట్లుగా డిసైడ్ కావటం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇంతకాలం ఆల్ ఈజ్ వెల్ అన్నట్లుగా వ్యవహరించే సినీ నటులు.. తమ ముసుగుల్ని తీసేసి.. తెర వెనుక జరిగే అంశాలపై ఓపెన్ కావటం ఒక కీలక పరిణామంగా చెప్పాలి. ప్రకాశ్ రాజ్ ప్యానల్ ప్రెస్ మీట్ చివరిది కాదు. ఆ మాటకు ఇస్తే.. ఇదే అసలుసిసలు ఆరంభంగా చెప్పాలి. రానున్న రోజుల్లో మరెన్నో తెర ముందుకు రానున్నాయన్న మాట వినిపిస్తోంది.