ఆర్ ఆర్ ఆర్ లో భీమ్ బాబాయ్..ఏమైనట్లు?

Update: 2020-04-10 09:52 GMT
దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్. మూవీ షూటింగ్ ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సంబందించిన టైటిల్ టీజర్ - రామ్ చరణ్ పాత్రకి సంబందించిన టీజర్ ని జక్కన్న ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చి సంబరపరిచారు. వీటిని చూసిన తర్వాత సినిమాపై మరిన్ని అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పటికే ఈ సినిమాలో హాలీవుడ్ - బాలీవుడ్ కి చెందిన స్టార్ కాస్టింగ్ ని రాజమౌళి ఫైనల్ చేశాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ ని ఎంపిక చేసినట్లు వార్తలు వినిపించాయి. అయితే మోహన్ లాల్ పాత్ర సినిమాలో ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి అందరి లో నెలకొంది.

ఈ సినిమాలో ఎన్టీఅర్ కొమరమ్ భీమ్ పాత్రలో నటిస్తుండగా అతనికి బాబాయ్ గా మోహన్ లాల్ కనిపిస్తాడని ప్రచారం జరిగింది. కొమరమ్ భీమ్ జీవితంలో ఆయన బాబాయ్ పాత్ర ఉందని ఆ పాత్ర కోసం మోహన్ లాల్ ను కరెక్ట్ అని భావించినట్లు వినికిడి. భీమ్ పోరాట పటిమను - ఆయనలో ఉద్యమ కాంక్షని రగిల్చిన ఆ పాత్రలో మోహన్ లాల్ కనిపిస్తాడని అనుకున్నారంతా. అయితే ‘రౌద్రం రణం రుధిరం’ సినిమా భీమ్ యుక్త వయసు నుండి మొదలవ్వనుంది. ఆ కారణంగా కొమరం భీమ్ బాబాయ్ పాత్ర ను సినిమాలో పెట్టట్లేదని సమాచారం. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతుందని అని తారక్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. మే 20న ఎన్టీఆర్ కొమరం భీమ్ లుక్ సంబంధించిన వీడియో కోసం అభిమానులు ఆసక్తిగా వేయికళ్లతో చూస్తున్నారు. చూడాలి మరి రాజమౌళి నుండి త్వరలో ఎలాంటి సందేశం అందుతుందో..
Tags:    

Similar News