టాలీవుడ్ లో ఈసారి సంక్రాంతికి బిగ్గెస్ట్ వార్ చూడబోతున్నాం. సీనియర్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి మరియు నటసింహం నందమూరి బాలకృష్ణ చాలా ఏళ్ళ తర్వాత బాక్సాఫీస్ వద్ద తలపడబోతున్నారు. 'వాల్తేరు వీరయ్య' మరియు 'వీర సింహారెడ్డి' సినిమాలు కేవలం ఒక రోజు గ్యాప్ లో థియేటర్లలోకి రాబోతున్నాయి. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ రెండు పెద్ద చిత్రాలూ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లోనే రూపొందాయి.
ఒకే నిర్మాణ సంస్థ రెండు భారీ సినిమాలు ఒకే సీజన్ లో రిలీజ్ అవ్వడం బహుషా తెలుగులో ఇదే మొదటిసారి అనుకుంటా. ఇప్పటికైతే అఫీషియల్ గా డేట్స్ ఇవ్వలేదు కానీ.. 2023 సంక్రాంతికి వస్తున్నట్లు దృవీకరించారు. చిరు - బాలయ్య సినిమాల మధ్య క్లాష్ రాకుండా చూడాలని చాలా ప్రయత్నాలే జరిగాయి. కానీ అవేమీ ఫలించకపోవడంతో రెండు చిత్రాలను ఒకేసారి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. అయితే మేకర్స్ కు ఇప్పటి నుంచే అసలైన అగ్ని పరీక్ష ఎదురుకాబోతోంది.
ఇద్దరు పెద్ద హీరోల సినిమాలను ఒకేసారి విడుదల చేయడం అంత ఈజీ అయిన పని కాదు. వేర్వేరు నిర్మాణ సంస్థల నుంచి వస్తున్న సినిమాలకే.. ఎన్నో ఇబ్బందులు వస్తాయి. అలాంటిది ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ టీమ్ నిర్మించిన రెండు చిత్రాలు వస్తున్నాయి. అది కూడా కొన్ని దశాబ్ధాలుగా బాక్సాఫీస్ ప్రత్యర్థులుగా ఉన్న బాలయ్య - చిరు సినిమాలు. అందుకే థియేటర్స్ కేటాయింపుల దగ్గర నుంచి ప్రమోషన్స్ చేసి సరైన ప్లానింగ్ తో రిలీజ్ చేయడం వరకూ ప్రతీది సవాలుతో కూడుకున్నదే. ఇక్కడ అతి పెద్ద ఛాలెంజ్ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేయడం.
సంక్రాంతికి గట్టిగా రెండు నెలల సమయం ఉంది. ప్రస్తుతానికి రెండు సినిమాల చిత్రీకరణలు చివరి దశలో ఉన్నాయి. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఒక్కసారి రిలీజ్ డేట్స్ ఇచ్చిన తర్వాత దూకుడుగా ప్రమోషన్స్ చేయాల్సి ఉంటుంది. అన్ని విషయాల్లోనూ 'వాల్తేరు వీరయ్య' మరియు 'వీర సింహారెడ్డి' సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగాల్సి ఉంటుంది. ఏమాత్రం తేడా వచ్చినా మెగా మరియు నందమూరి ఫ్యాన్స్ నిర్మాణ సంస్థ మీద రెచ్చిపోయే అవకాశం ఉంటుంది.
చిరంజీవి సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తే.. బాలకృష్ణ చిత్రం నుంచి కూడా అప్డేట్ కోరుకుంటారు అభిమానులు. ఇప్పటికే #NBK107 ఫస్ట్ సింగిల్ ని అతి త్వరలో విడుదల చేయబోతున్నట్లు ఒక వార్త వస్తేనే.. #Mega154 ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఎప్పుడు అని మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేయడం స్టార్ట్ చేసారు. రెండు సినిమాల నుంచి టైటిల్ టీజర్స్ తప్ప ఇప్పటి వరకూ వేరే ప్రమోషనల్ కంటెంట్ ఏదీ రాలేదు కాబట్టి.. రెగ్యులర్ అప్డేట్స్ విషయంలో రాబోయే రోజుల్లో ఫ్యాన్స్ నుంచి మేకర్స్ ఒత్తిడి తప్పదు.
ఇక తేదీ దగ్గర పడిన తర్వాత రెండు చిత్రాలకు సమానంగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ప్లాన్ చేయాలి. అందులో ఏమాత్రం తేడా వచ్చినా అభిమానులు ఊరుకునే పరిస్థితి లేదు. రెందు చిత్రాల బడ్జెట్ మరియు బిజినెస్ లెక్కలు పట్టించుకోకుండా మేకర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే రాబోయే రెండు నెలలు మైత్రీ టీమ్ కి మామూలు ప్రెజర్ ఉండదనే చెప్పాలి. మరి చిరంజీవి మరియు బాలయ్య ఫ్యాన్స్ ని తట్టుకొని రెండు సినిమాలను ఎలా రిలీజ్ చేస్తారో చూడాలి.
'వీర సింహా రెడ్డి' సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తుండగా.. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో 'వాల్తేరు వీరయ్య' చిత్రం రూపొందుతోంది. ఇందులో చిరంజీవి సరసన కూడా శృతి హాసన్ కథానాయికగా చేస్తోంది. రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. సమవుజ్జీవులైన ఈ రెండు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్స్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాలను అందుకుంటాయో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.