సమంత రూత్ ప్రభు నుంచి బ్రేకప్ తర్వాత తన లైఫ్ ఎలా మారింది? అనే విషయంపై నాగ చైతన్య ప్రముఖ జాతీయ మీడియాతో ఓపెనయ్యారు. ఇప్పుడు తాను చాలా ఎక్స్ ప్రెసివ్ గా మారానని చైతూ చెప్పాడు. ఇటీవలి కాలంలో నేను ఒక వ్యక్తిగా చాలా మారిపోయాను. ఇంతకుముందు నేను పెద్దగా ఓపెనవ్వలేకపోయేవాడిని. కానీ ఇప్పుడు నేను అలా చేయగలుగుతున్నాను. నా కుటుంబ సభ్యులు .. స్నేహితులతో అనుబంధం విషయంలోనూ ప్రతిదీ ఓపెనవుతున్నాను. ఇది చూడటానికి చాలా ఆనందాన్నిస్తోంది. నేను పూర్తిగా మారిన కొత్త వ్యక్తిని'' అని అన్నారు.
నిజానికి చైతన్య ఎక్స్ ప్రెసివ్ కాదు. సమంత ఎంతో ఎక్స్ ప్రెస్సివ్. అందుకే అతడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తాను మారాలని అనుకున్నారా? అంటూ ఇప్పుడు చర్చ సాగుతోంది. ఏది ఏమైనా కానీ బ్రేకప్ వ్యవహారంలో చైతన్య డీసెంట్ ప్రవర్తనతో అభిమానులను ఆకట్టుకున్నాడు.
సోషల్ మీడియాల్లో వ్యాఖ్యలతో సామ్ విమర్శలను మూటగట్టుకుంది. అలా చేసి ఉండాల్సింది కాదన్న విమర్శలు వచ్చాయి. దీనిపై కరణ్ జోహార్ తన కాఫీ విత్ కరణ్ సీజన్ 7 ఎపిసోడ్ లో సామ్ ని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దీనికి సమాధానంగా తన లైఫ్ పై ఇన్వెస్ట్ చేసిన అభిమానులకు ప్రతిదీ తెలియాలని అనుకున్నాను అని సమంత నిర్ధ్వంద్వంగా సమాధానమిచ్చారు.
ఎఫైర్ గురించి ప్రశ్నలు..?!
నాగచైతన్య తెలుగు మీడియా నుంచి తప్పించుకున్నా కానీ అతడిని జాతీయ మీడియా విడిచిపెట్టడం లేదు. స్థానిక మీడియాని వ్యక్తిగత ప్రశ్నలు అడగకుండా మ్యానేజ్ చేయగలిగినా కానీ జాతీయ మీడియాని మ్యానేజ్ చేయడం చాలా కష్టతరమైనది. ఇంతకుముందు బంగార్రాజు విడుదల సమయంలో సమంతతో నాగచైతన్య బ్రేకప్ గురించి ప్రశ్నించకుండా స్థానిక మీడియాని ఆపగలిగారు కానీ జాతీయ మీడియాని ఆపలేకపోయారు. అక్కడి వ్యాఖ్యలను ఇక్కడా మీడియాల్లో ప్రచురించారు.
ఇక ఇటీవల సమంత నుంచి విడిపోయాక.. దీనికి కారణం అందాల కథానాయిక శోభిత ధూళిపాలతో నాగచైతన్య ఎఫైర్ అని కూడా మీడియాలో కథనాలొచ్చాయి. అయితే వీటన్నిటిపైనా స్థానిక మీడియా థాంక్యూ ఇంటర్వ్యూల్లో ప్రశ్నించకుండా మేనేజ్ చేశారని గుసగుస వినిపించింది. అలాగే జాతీయ మీడియాకు కూడా చిక్కకుండా చై బృందం ఆపగలిగిందని కథనాలొచ్చాయి.
నాగ చైతన్య నటించిన థాంక్యూ ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా నెగెటివ్ సమీక్షలతో ఇబ్బందిని ఎదుర్కొంది. విక్రమ్.కె కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాశీఖన్నా కథానాయికగా నటించింది. తదుపరి లాల్ సింగ్ చడ్డా విడుదల కోసం చై వేచి చూస్తున్నాడు. ఈ చిత్రం ఆగస్టు లో విడుదల కానుంది. ఇందులో అమీర్ ఖాన్ - నాగచైతన్య ప్రధాన పాత్రల్లో నటించారు. హాలీవుడ్ క్లాసిక్ మూవీ ఫారెస్ట్ గంప్ కి ఈ చిత్రం రీమేక్ గా తెరకెక్కింది. తెలుగు-హిందీ-తమిళంలో ఈ చిత్రం విడుదల కానుంది.