సీనియర్ హీరో జగపతిబాబు ఫేడ్ అవుట్ అయ్యే దశలో బోయపాటి-బాలయ్య సినిమా 'లెజెండ్' లో విలన్ గా నటించి ఒక్కసారిగా అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నారు. జగపతి బాబు విలనిజం ఒక్కసారిగా ట్రెండ్ సృష్టించింది అనడం కూడా అతిశయోక్తి కాదు. అప్పటి నుంచి జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలన్ గా చాలా బిజీగా మారారు.
ఒక దశలో అయన సౌత్ లోనే ఎక్కువ డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగారు. తమిళ.. మలయాళ చిత్రాల్లో కూడా నటించారు. పోయినేడాది 'రంగస్థలం' లో విలన్ పాత్ర కూడా ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది. అయితే ఈ ఏడాది ఎందుకో జగపతిబాబు హవా తగ్గిందనే టాక్ వినిపిస్తోంది. 'సరిలేరు నీకెవ్వరు' లో ఒక ముఖ్య పాత్రకు మొదట జగపతిబాబు నే తీసుకున్నప్పటికీ తర్వాత మాత్రం ఆ పాత్ర ప్రకాష్ రాజ్ కు దక్కింది. 'సైరా' లాంటి ఒకటి రెండు సినిమాల్లో నటించారు కానీ వేరే సినిమాల్లో ఆయన లేరు.
ఈమధ్య ఆయనకు ఆఫర్లు తగ్గాయని అంటున్నారు. కొత్త జెనరేషన్ ఫిలింమేకర్లు జగ్గు భాయ్ పేరును పరిశీలించడం లేదని.. బాలీవుడ్ నటులను తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారని అంటున్నారు. మరి ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుందా..జగ్గుభాయ్ కెరీర్ మళ్ళీ స్లో అయినట్టేనా అనేది వేచి చూడాలి. ఒకవేళ ఆఫర్లు తగ్గితే మాత్రం ఈసారి జగ్గుభాయ్ కి రిటైర్ మెంట్ తప్పదేమో.