సూపర్ స్టార్ మహేష్ లాంటి హీరోలతో ముందు అనుకున్న కథలు సెట్స్ పైకి వెళ్లి ఓ షెడ్యూల్ ని పూర్తి చేసిన తరువాత మారిన సందర్భాలు చాలా తక్కువ. కానీ మహేష్ సినిమా విషయంలో మాత్రం ఇలాంటి మార్పు జరిగినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ల కలయికలో ప్రస్తుతం SSMB 28 ప్రాజెక్ట్ రూపొందుతున్న విషయం తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ ఎస్. రాధాకృష్ణ అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తున్నారు.
గత కొన్ని నెలలుగా ఊరిస్తున్న ఈ మూవీ ఎట్టకేలకు సెప్టెంబర్ 12న పట్టాలెక్కింది. అన్నపూర్ణ స్టూడియోస్ లో మహేష్ సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ మూవీని యాక్షన్ ఎపిసోడ్ తో మొదలు పెట్టారు. మూడు రోజుల షూటింగ్ అనంతరం రామోజీ ఫిలిం సిటీకి షూటింగ్ మారింది. అక్కడ అన్బు అరివు నేతృత్వంలో భారీ యాక్షన్ ఎపిసోడ్ ని పూర్తి చేశారు. దీంతో ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. తదుపరి షెడ్యూల్ కోసం బ్రేకిచ్చారు.
ఇదే సమయంలో మహేష్ మాతృమూర్తి ఇందిరా దేవి మృతి చెందడంతో షూటింగ్ కి మరింత విరామం తప్పలేదు. పెద్ద కర్మ పూర్తి చేసిన తరువాత మహేష్ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కోసం లండన్ వెళ్లిపోయాడు. రీసెంట్ గా హైదరాబాద్ తిరిగి వచ్చినా హీరోయిన్ పూజా హెగ్డే కాలికి గాయం కావడం, ముందు అనుకున్న ప్రకారం త్రివిక్రమ్ పూర్తి స్థాయి స్క్రిప్ట్ ని మహేష్ కి నరేట్ చేయకపోవడంతో తదుపరి షెడ్యూల్ కు బ్రేకిచ్చారు.
తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ స్టోరీలో త్రివిక్రమ్ భారీ మార్పులు చేశాడని, ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలని మార్పులు చేసి మహేష్ ని ఒప్పించాడట. దీంతో ఫస్ట్ షెడ్యూల్ అంతా వేస్ట్ అయినట్టుగా తెలుస్తోంది. తాజా మార్పుల నేపథ్యంలో మహేష్ కు విలన్ గా బాలీవుడ్ ఐటమ్ బాంబ్ నోరా ఫతేని రంగంలోకి దించేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై మరింత క్లారిటీ రావాల్సిన అవసరం వుంది.
మహేష్ - త్రివిక్రమ్ దాదాపు పుష్కర కాలం తరువాత కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై సహజంగానే అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా సినిమాని తెరపైకి తీసుకురావాలని త్రివిక్రమ్ తాజాగా ప్లాన్ మార్చడమే కాకుండా స్టోరీని కూడా మార్చినట్టుగా తెలుస్తోంది.
అందులో భాంగానే బాలీవుడ్ ఐటమ్ బాంబ్ నోరా ఫతేహీని విలన్ గా రంగంలోకి దించేస్తున్నారని, ఈ మూవీని పాన్ ఇండియా వైడ్ గా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.