నిజంగా తారక్ ఒప్పుకుంటాడా?

Update: 2019-03-27 09:03 GMT
త్వరలో జరగబోయే సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ ని గెస్ట్ గా తీసుకొచ్చే అవకాశాల గురించి పెద్ద ఎత్తున టాకే వినిపిస్తోంది. చరణ్ కు తారక్ కున్న స్నేహం దృష్ట్యా వచ్చే అవకాశాల గురించి ఊహాగానాలు కాస్త గట్టిగానే ఉన్నాయి. అయితే ఇక్కడ మర్చిపోకూడని మరో కోణం ఉంది.

సాధారణంగా మెగా హీరోల ఫంక్షన్ లు ఏవి జరిగినా ఎవరో ఒకరు అదే కాంపౌండ్ హీరో అతిధిగా రావడం మామూలే. అందుకే పవన్ పేరుతో ఫ్యాన్స్ అంత అల్లరి చేసినా ఆ రచ్చ ఆడిటోరియం దాటి బయటికి వచ్చేది. అల్లు అర్జున్ ఓ సారి సంయమనం కోల్పోయి చెప్పను బ్రదర్ అని చెప్పడం దాని తాలూకు సెగలు చాలా రోజుల పాటు వేటాడటం ఎవరూ మర్చిపోలేదు. ప్రభాస్ కు సైతం ఇది అనుభవం కాక తప్పలేదు. కాకపోతే డార్లింగ్ చాలా స్మార్ట్ గా తప్పుకున్నాడు.

ఇప్పుడు పవన్ సినిమాలు చేయడం లేదు. అలాగని అభిమానగణం తగ్గలేదు. జనసేన కోసం మొత్తం కార్యరంగంలో ఉన్నారు. ఇప్పుడు మెగా హీరోల వేడుక ఏది జరిగినా అక్కడా పవన్ జనసేన అనే నినాదాలు తప్పవు. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ వచ్చి మాట్లాడేటప్పుడు ఇలాంటివి జరిగితే నిర్వాహకులకు కూడా ఇబ్బందిగా ఉంటుంది.

పైగా టిడిపి తరఫునే ప్రచారం చేయకుండా సైలెంట్ గా ఉన్న తారక్ జనసేన స్లోగన్స్ కి రెస్పాండ్ అయ్యే ఛాన్స్ లేదు. అలా అని కొందరు అభిమానులు చేసే ఈలలు గోలలు ఆగవు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ చిత్రలహరి వేడుకకు రావడం దాదాపు జరగని పనే. ఒకవేళ వస్తే జరిగే తీరు మాత్రం ఆసక్తికరంగ ఉంటుంది
Tags:    

Similar News