యంగ్ టైగర్ ఎన్టీఆర్ `ఆర్ ఆర్ ఆర్` చిత్రీకరణ సహా డబ్బింగ్ పనులు పూర్తిచేసి నెలలు గడుస్తోంది. ప్రచార రూపంలో సినిమాకి కావాల్సినంత బజ్ తీసుకురావడంలో తారక్ చేయాల్సిందల్లా చేసారు. ఇక తారక్ సమకాలీకుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా షూటింగ్ మొదలు పెట్టేసి రెండు షెడ్యూల్ పూర్తిచేసారు. కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి చర్చలు వేగంగా జరుపుతున్నారు. కానీ యంగ్ టైగర్ మాత్రం ఇంకా కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కించలేదు.
వాస్తవానికి చరణ్ కంటే ముందు తారక్ సినిమా ప్రారంభం అవుతుందని ప్రచారం సాగింది. కొరటాల శివ దర్శకుడిగా కొత్త సినిమా పట్టాలెక్కించనున్నారని అంతా భావించారు. అలాగే యంగ్ మేకర్ `ఉప్పెన` దర్శకుడు బుచ్చిబాబు సానాతో కూడా ప్రాజెక్ట్ కమిట్ అయినట్లు వెలుగులోకి వచ్చింది. అయితే ఈ రెండు కూడా ఇంకా పట్టాలెక్కలేదు. కొరటాల శివతో ప్రాజెక్ట్ ఖరారు అయినా...బుచ్చిబాబు విషయంలో తారక్ ఇంకా ఓ నిర్ణయానికి వచ్చినట్లు లేదని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.
దీంతో తారక్ ఈ ప్రాజెక్ట్ ని ఎందుకు డిలే చేస్తున్నాడన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. తారక్ బుచ్చి బాబు విషయంలో ఇంత టైమ్ ఎందుకు తీసుకుంటున్నాడు? అతని స్ర్కిప్ట్ పై తారక్ కి నమ్మకం సరిపోవడం లేదా? బుచ్చిబాబు స్పోర్స్ట్ డ్రామా పై ఇంకా సందేహాలున్నాయా? అందుకే ఇంకా ఫైనల్ చేయలేదా? అని ప్రచారం మొదలైంది. అయితే తారక్ సన్నిహిత వర్గాలు మాత్రం `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ వరకూ తారక్ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదని అంటున్నాయి.
`ఆర్ ఆర్ ఆర్` ఫలితాన్ని బట్టి తారక్ తుదిగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఏది ఏమైనా తారక్ డెసిషన్ పై బుచ్చిబాబు ప్రాజెక్ట్ ఆధారపడి ఉంది? అన్నది క్లారిటీ వస్తోంది. `ఆర్ ఆర్ ఆర్` ఈనెల 25న వరల్డ్ వైడ్ గా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తోంది. త్వరలో టీమ్ మళ్లీ `ఆర్ ఆర్ ఆర్` ప్రచారం పనుల్లో నిమగ్నం కానున్నారు. అయితే వీలైనంత త్వరగా సినిమా ప్రారంభించాలని తారక్ కూడా వెయిట్ చేస్తున్నారు.
కేవలం `ఆర్ ఆర్ ఆర్` కోసమే మూడేళ్లు కేటాయించారు. మధ్యలో ఎలాంటి కమర్శియల్ సినిమా చేయలేదు. ఈ నేపథ్యంలో `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ అయిన వెంటనే కొరటాల ప్రాజెక్ట్ ని ముందుగా పట్టాలెక్కించనున్నారు. ఆ తర్వాత బుచ్చిబాబు సినిమా విషయంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.