మార్పు రెండు విధాలుగా వస్తుంది.. అభివృద్ధిలో భాగంగా వచ్చేది మొదటిది. అవసరం మేరకు దూసుకొచ్చేది రెండోది. ఇప్పుడు.. సినీ ఇండస్ట్రీ ఎదుట రెండో తరహా మార్పు వచ్చి నిలబడింది. ఆహ్వానంతో పనిలేదు.. అనివార్యతే అన్న పరిస్థితి రావడంతో గత్యంతరం లేక కొందరు ఆ మార్పునకు తలొగ్గుతున్నారు. అదే ఓటీటీ! వెండితెర తలుపులు స్వేచ్చగా తెరుచుకునే పరిస్థితులు ఇప్పట్లో కనిపించకపోవడంతో.. అనివార్యంగా ఓటీటీల్లో బొమ్మ ఆడిస్తున్నారు. అయితే.. ఇది తాత్కాలికమా? శాశ్వతమా?? చిత్రపరిశ్రమకు లాభమా? నష్టమా?? ఈ మార్పు ఇండస్ట్రీని ఏ తీరానికి చేరుస్తుంది? అన్న ప్రశ్నలు ముందుకొస్తున్నాయి.
*"తెర"దించిన కరోనా..
యావత్ ప్రపంచాన్ని కనీవినీ ఎరుగని రీతిలో కుదిపేసింది కరోనా. ఆ కుదుపులకు అన్ని రంగాలూ స్తంభించిపోయాయి. ఈ ఏడాది మార్చిలో లాక్ డౌన్ తో మూతపడ్డ థియేటర్లు.. ఇప్పటికీ పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు. ఫలితంగా చిత్రపరిశ్రమ దారుణంగా దెబ్బతింది. ఓ అంచనా ప్రకారం దేశంలో.. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్‌వుడ్ మిగతా ప్రాంతీయ పరిశ్రమలను కలుపుకుంటే ఇప్పటివరకూ సుమారు రూ. పది వేల కోట్ల మేర వ్యాపారం నష్టపోయినట్టు అంచనా. షూటింగులు ఆగిపోయి చిత్రసీమ మీద ఆధారపడ్డ ప్రతిఒక్కరూ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దాదాపు ఏడూ నెలల తర్వాత ఇటీవల షూటింగులు ప్రారంభమయ్యాయి. ప్రారంభం అయితే అయ్యాయి కానీ.. పూర్తయ్యాక సినిమాలను ఎక్కడ రిలీజ్ చేయాలన్నదే ప్రశ్న.
*థియేటర్లకు వస్తారా?
కరోనా కాస్త తగ్గుముఖం పట్టిందని సినిమా థియేటర్లు తెరిచేందుకు ప్రభుత్వం ఆంక్షలతో కూడిన అనుమతులు ఇచ్చింది. ఇందులో ప్రధానమైన ఆంక్ష 50 శాతం ఆక్యుపెన్సీ. అంటే.. ప్రతీ ఇద్దరి మధ్యలో ఒక సీటు ఖాళీగా వదిలి పెట్టాలి. కలెక్షన్లకు ఇది పెద్ద ఇబ్బంది. అసలు.. గతంలో మాదిరిగా ప్రేక్షకులు థియేటర్ కు వస్తారో రారో అన్న సందేహం ఓ వైపు ఉండగా.. ఈ సగం ప్రేక్షకుల కోసం ఆట వేయడం తీవ్ర నష్టం కలిగిస్తుందనే వాదన ఉంది. వాస్తవానికి పరిస్థితి కూడా అలాగే ఉంది. ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినా.. ఇప్పటికీ థియేటర్లు అన్నీ ఓపెన్ కాలేదు. జనం కూడా తగినట్టు స్పందించట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నిర్మాతలకు దిక్కు తోచట్లేదు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని సిద్ధంగా ఉన్న సినిమాల పరిస్థితి అయితే అగమ్యగోచరంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది ఓటీటీ!
*ఓవర్ ది టాప్..
ఓటీటీ అంటే.. ఓవర్ ది టాప్. హైస్పీడ్ ఇంటర్నెట్ ఆధారంగా టీవీ, సినిమాకు సమాంతరంగా నడిచే వ్యవస్థ. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌గా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్, ఆహా ఉన్నాయి. కరోనా భయంతో థియేటర్లు తెరుచుకుంటాయో లేదో..? జనం వస్తారో రారో..? అనే ఆందోళనల నేపథ్యంలో ఈ ఓటీటీ తెరపైకి వచ్చింది. ఈ ఏడాది మొదటి మూడు నెలలు మాత్రమే థియేటర్లో బొమ్మ పడింది. ఆ తర్వాత లాక్ డౌన్ పుణ్యామాని.. తాళాలు పడ్డాయి. దీంతో అప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల నిర్మాతలు దిక్కు తోచని స్థితిలో పడ్డారు. ఆర్థికంగా బలమైన నిర్మాతలు మొండి ధైర్యంతో వేచి చూస్తున్నా.. చిన్న నిర్మాతలు మాత్రం తట్టుకోలేకపోతున్నారు. సినిమా నిర్మాణం కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు కొండలా పెరిగిపోతుండటంతో.. తప్పని పరిస్థితుల్లో కొందరు తమ సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేశారు.. చేస్తున్నారు. ఆ విధంగా.. "ఉమామహేశ్వర ఉగ్రరూపస్య", "అసలేం జరిగింది" నాని-సుధీర్ నటించిన "వీ", సూర్య నటించిన "ఆకాశం నీ హద్దురా" తదితర చిత్రాలు మొదలు.. తాజాగా "మిడిల్ క్లాస్ మెలోడీస్", "బెల్ బాటం" వంటి సినిమాల వరకు ఉన్నాయి. అయితే.. ఇందులో "వీ", "ఆకాశం నీ హద్దురా" తప్ప, మిగిలినవన్నీ చిన్న సినిమాలే. లాక్‌డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన ప్రేక్షకులు అరచేతిలో సినిమాలు చూడటాన్ని ప్రస్తుతానికి బాగానే ఆస్వాదిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు. అయితే.. సాధారణ పరిస్థితులు నెలకొన్నాక ఈ స్థాయిలో రిసీవ్ చేసుకుంటారా? లేక థియేటర్ల వైపే పరిగెడతారా? అనేది సందేహం.
*నష్టాల భయం..
ఓటీటీలో విడుదల చేయాలంటే.. నిర్మాతలను నష్టాల భయం వెంటాడుతోంది. ఇప్పటివరకూ ఓవర్ ది టాప్ లో తమ చిత్రాలను విడుదల చేసిన వారిలో అందరూ.. అప్పులు, వడ్డీల బాధలు భరించలేకపోయినవారేనని సమాచారం. వాస్తవానికి.. మొదట రిలీజైన "వీ" చిత్రానికి అమెజాన్ ప్రైం భారీ మొత్తం చెల్లించింది. ఆ సినిమా సరిగా ఆడకపోవడంతో.. ఆ ప్రభావం తర్వాత రిలీజ్ చేసిన చిత్రాల పై పడింది. వాటికి పెద్ద మొత్తంలో చెల్లించడానికి సంస్థలు ముందుకు రావడం లేదని టాక్. అయితే.. సూర్య నిర్మించి, నటించిన "ఆకాశం నీ హద్దురా" (తమిళంలో సురారై పోట్రు) మాత్రం మంచి విజయాన్ని దక్కించుకుంది. ఈ విధంగా మిశ్రమ ఫలితాలు రావడంతో నిర్మాతలు ఆలోచనలో పడ్డారు. కానీ.. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి తీస్తున్న పెద్ద సినిమాలను ఓటీటీలో విడుదల చేస్తే.. రాబడి సరిగా ఉండదనే భయం వారిని వెంటాడుతోంది. భారీ సెట్టింగులు, గ్రీఫిక్స్ తో రూపొందే సినిమాలను ఓటీటీలో చూస్తే తగిన ఫీలింగ్ రాదంటున్నారు. ఇలాంటి చిత్రాలను థియేటర్లలో చూస్తేనే.. ప్రేక్షకులు ఆ అనుభూతిని ఆస్వాదిస్తారని, అప్పుడే వ్యూవ్స్ పెరిగి మంచి వసూళ్లు వస్తాయనే కోణంలో పెద్ద నిర్మాతలు ఆలోచిస్తున్నారట. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ ప్రధాన తారగణంగా రాజమౌళి తెరకెక్కిస్తున్న "ఆర్ఆర్ఆర్", కొరటాల శివదర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న "ఆచార్య", పవన్ "వకీల్ సాబ్", మహేష్ "సర్కారు వారి పాట" వంటి చిత్రాలు ఆ కోవలోవే.
*ఏం జరుగుతుంది..?
ఓటీటీ నాణేనికి రెండు వైపులా రెండు కోణాలున్నాయి. ప్రస్తుత సంక్షోభ సమయంలో సినిమాల విడుదలకు మంచి ఫ్లాట్ ఫాం. కానీ.. కరోనా పూర్తిగా సద్దుమణిగి, థియేటర్లు మొత్తం తెరుచుకున్న తర్వాత కూడా ఇదే ఆదరణ ప్రేక్షకుల నుంచి ఉంటుందా? అన్నది డౌట్. అలాగని ఉండదు అని కూడా చెప్పలేం. ఇదిలా ఉంటే.. ఇండస్ట్రీలో ఎంతోకాలంగా ఉన్న విమర్శ థియేటర్ల కొరత. కావాలని కొన్ని సినిమాలను అడ్డుకుంటున్నారనే వాదన కూడా ఉంది. ఓటీటీ ద్వారా ఆ గోలకు ఫుల్ స్టాప్ పడొచ్చు. ఇలా.. పలు సానుకూల అంశాలు ఉన్నప్పటికీ.. ఎంతవరకు వర్కవుట్ అవుతుందేనే లెక్క పర్ఫెక్ట్ గా వేయలేకపోతున్నారు సినీ పండితులు. ఇప్పటికైతే చిన్న చిత్రాలు అనివార్యంగా ఓటీటీ, ఏటీటీలో రిలీజ్ చేస్తుండగా.. పెద్ద నిర్మాతలు మాత్రం వేచిచూసే ధోరణిలో ఉన్నారు. మరి, అంతిమంగా ఈ ఓటీటీ తెలుగు చిత్రసీమను ఎటువైపు నడిపిస్తుంది..? ఈ మార్పు శాశ్వతమా.. తాత్కాలికమా? అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి