గతంలో పలు సార్లు రవితేజ మరియు బాలకృష్ణ సినిమాలు ఒకే వారంలో రావడం లేదంటే ఒకే రోజున రావడం జరిగింది. దాంతో చాలా మంది చాలా రకాలుగా అనుకున్నారు. బాలకృష్ణ తో పోటీ గా రవితేజ పట్టుబట్టి మరీ తన సినిమాలను విడుదల చేయాలని కోరుకుంటాడు.. నిర్మాతలను ఒత్తిడి చేసి మరీ తన సినిమాలు బాలయ్య సినిమా లు వచ్చే రోజున రవితేజ విడుదల చేయించిన రోజులు ఉన్నాయి అంటూ వార్తలు వచ్చాయి.
ఆ పుకార్లన్నింటికి కూడా బాలయ్య తన అన్ స్టాపబుల్ టాక్ షో తో చెక్ పెట్టాడు. తన షో కి రవితేజని పిలిచి మరీ తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవు అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆ సమయం లోనే క్ల్యాష్ గురించి మాట్లాడటం జరిగింది. అది అనుకోకుండా జరిగిందే కానీ ఉద్దేశ్యపూర్వకంగా జరిగింది కాదని.. ఇద్దరం కలిసి మల్టీస్టారర్ చేస్తాం అంటూ ఇద్దరు కూడా ప్రకటించిన విషయం తెల్సిందే.
రవితేజ మరియు బాలయ్య ఇద్దరు ఆ ప్రకటన చేశారో లేదో మళ్లీ ఇద్దరి సినిమా లు డిసెంబర్ లో పోటీ పడబోతున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. బాలయ్య ప్రస్తుతం నటిస్తున్న గోపీచంద్ మలినేని చిత్రం ను డిసెంబర్ లో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు.
డిసెంబర్ లో రవితేజ నటించిన ధమాకా సినిమాను విడుదల చేయడం దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది. గత ఏడాది డిసెంబర్ లో అఖండ వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఇప్పుడు అదే తరహా లో బాలయ్య డిసెంబర్ సెంటిమెంట్ ను ఉపయోగించుకుని సక్సెస్ దక్కించుకుంటే బాగుంటుందనే అభిప్రాయం తో ఉన్నారు.
అందుకే రవితేజ మరియు బాలయ్య సినిమాలు డిసెంబర్ లో వస్తాయని.. కాస్త అటు ఇటుగా రెండు సినిమాలతో మళ్లీ వీరిద్దరు పోటీ పడటం ఖాయం అన్నట్లుగా చర్చ జరుగుతున్న సమయంలో ఇంకా బాలయ్య క్లారిటీ ఇవ్వక పోడంతో డిసెంబర్ లో వీరిద్దరి యొక్క క్ల్యాష్ ఉందా లేదా అంటూ ఇద్దరు హీరోల అభిమానుల్లో చర్చ జరుగుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.