మెగా హీరో సాయి ధరమ్ తేజ్ 'రిపబ్లిక్' సినిమాను జూన్ 4న విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే. దేవా కట్టా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పొలిటికల్ డ్రామా చిత్రం విడుదల విషయంలో ఆలోచనల్లో పడ్డట్లుగా నిర్మాత పుల్లారావు మాటలను బట్టి అర్థం అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే చాలా ఏరియాల్లో థియేటర్లు మూసి వేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరో వైపు ప్రభుత్వం నుండి థియేటర్లకు 50 ఆక్యుపెన్సీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కర్ఫ్యూ నేపథ్యంలో థియేటర్లు రాత్రి షో లు పడటం సాధ్యం అయ్యే విషయం కాదు. కనుక మొత్తంగా థియేటర్లను మూసి వేయడం ఉత్తమం అనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
థియేటర్లు ఓపెన్ ఉన్నా కూడా జనాలు కరోనా భయంతో వచ్చేది అనుమానంగా ఉంది. కనుక కరోనా పరిస్థితులు కుదుట పడి థియేటర్లు మళ్లీ 100 శాతం ఆక్యుపెన్సీ అనుమతులు వచ్చిన తర్వాత 'రిపబ్లిక్' సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. జూన్ కు ఇంకా సమయం ఉంది. అప్పటి వరకు కూడా పరిస్థితులు ఇలాగే ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే జూన్ లో ఈ సినిమాను విడుదల చేయకుంటే మాత్రం చాలా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
వచ్చే నెల విడుదల అవ్వాల్సిన మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా నుండి మొదలుకుని చాలా సినిమాలు వాయిదాలు పడుతున్నాయి. కనుక అవి నూరు శాతం ఆక్యుపెన్సీ అనుమతులు వచ్చిన వెంటనే బ్యాక్ టు బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. కనుక రిపబ్లిక్ వంటి చిన్న సినిమాలు విడుదల వాయిదా వేసుకోవాల్సి రావచ్చు అంటున్నారు. అదే కనుక నిజం అయితే రిపబ్లిక్ మూవీ ఈ ఏడాది చివరి వరకు వెయిట్ చేయాల్సి రావచ్చు. మద్యలో విడుదల చేయాలనుకుంటే పెద్ద సినిమాలకు పోటీగా రావాల్సి ఉంటుంది. మరి రిపబ్లిక్ మేకర్స్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.