తూనీగ డేటింగ్ పుకార్ల‌కు మ‌రింత ఆజ్యం

Update: 2022-12-11 15:30 GMT
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో డేటింగ్ చేసిన రియా చ‌క్ర‌వ‌ర్తి అత‌డి మ‌ర‌ణానంత‌రం మ‌రోసారి డేటింగ్ వార్త‌ల‌తో సంచ‌ల‌నంగా మారారు. త‌న స‌హ‌చ‌ర న‌టుడు స్నేహితుడు అయిన బంటీ సజ్దేహ్ తో రియా చక్రవర్తి ప్రేమ‌లో ఉంద‌ని.. ఇరువైపులా కుటుంబ సభ్యుల ఆశీస్సులు కూడా ల‌భించాయ‌ని క‌థ‌నాలొస్తున్నాయి. శనివారం నాడు ఓ వేడుక‌కు రియా చ‌క్ర‌వ‌ర్తి... త‌న కొత్త ప్రియుడు బంటీ సోదరి అయిన‌ సీమా సజ్దేహ్ .. అలాగే త‌న‌ సోదరుడు షోక్ తో కలిసి ముంబైలోని ప్ర‌ముఖ నిర్మాత అమృతపాల్ సింగ్ బింద్రా ఇచ్చిన‌ పార్టీకి వచ్చారు.

రియా బ్లాక్ క‌ల‌ర్ దుస్తులలో ఈ పార్టీలో క‌నిపించింది. నెట్ ఫ్లిక్స్ రియాలిటీ షో 'ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్‌'లో కనిపించిన సీమా ఈ వేడుక‌లో వైట్ అండ్ వైట్ లో క‌నిపించారు. స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్లు వారి ఫోటోలను తీసేందుకు ప్రయత్నించినప్పుడు వారిద్దరూ కారులో వెనుక సీట్లలో కనిపించారు. రియా సోద‌రుడు షోక్ ముందు సీట్లో కూర్చున్నాడు.

తాజా మీడియా క‌థ‌నాల‌ ప్రకారం.. రియా - బంటీ ఈ సంవత్సరం ప్రారంభంలో డేటింగ్ ను ప్రారంభించారు. వాళ్ళను కలిసి చూడటం చాలా ఆనందంగా ఉందని స‌న్నిహితులు చెబుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా రియా ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నా బంటీ ఆమెకు కుడిభుజంగా నిలిచాడు.  క‌ష్టంలో అత‌డు ఒక వ్య‌వ‌స్థ‌లా ఆదుకున్నాడు... అని తెలిపారు. ఈ జంట‌ ప్రస్తుతం కలిసి ఉన్నారు. ఈ విష‌యాన్ని ప్రైవేట్ గా ఉంచాలనుకుంటున్నారు.. అని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

రియా ఇంతకు ముందు దివంగ‌త న‌టుడైన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తో డేటింగ్ లో ఉన్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. కానీ సుశాంత్  మరణం అనంత‌ర‌ విచారణలో.. సంబంధిత డ్రగ్స్ కేసులో రియా చిక్కుకుపోయింది. దాదాపు నెల రోజుల పాటు జైలులో గడపాల్సి వచ్చింది. డ్రగ్స్ కేసులో ఆమెను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) అరెస్టు చేసి బెయిల్ పై విడుదల చేసింది.

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)- ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) కూడా రియాను తర్వాత విచారించాయి. ఇతర సహ నిందితుల నుండి రియా అనేకసార్లు గంజాయి డెలివరీలను పొందిందని NCB ఆరోపించింది. సుశాంత్ మరణం స‌మ‌యంలో మీడియా రియాపై ఆరోపణలు చేయ‌డం.. ఇరువురి బంధం వెన‌క లొసుగుల‌ను ఎత్తి చూపిస్తూ సున్నితంగా చిత్రీకరించినందున క‌థ‌నాల‌తో విమర్శలను ఎదుర్కొంది. ఆమె చివరిగా రూమీ జాఫరీ  చెహ్రేలో కనిపించింది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ - ఇమ్రాన్ హష్మీ త‌దిత‌రుల‌తో క‌లిసి నటించారు.

బాలీవుడ్ భార్యల అద్భుతమైన జీవితాలపై దృష్టి సారించిన పాపుల‌ర్  షో 'ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్‌'లో... నలుగురు మహిళల్లో సీమా సజ్దే ఒకరు. మిగిలిన ముగ్గురు నీలం- మహీప్ కపూర్- భావన పాండే. సీమా ఇంతకుముందు సోహైల్ ఖాన్ ను వివాహం చేసుకుంది. కానీ వారు ఇప్పుడు విడిపోయారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News