`పుష్ప ది రైజ్` లో `ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ` మాట ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. సినిమా రిలీజ్ కి ముందే ఆ పాట మాస్ ఆడియన్స్ లోకి వాయి వేగంతో దూసుకుపోయింది. ఇక విజువల్ వీక్షణ తర్వాత అందులో నటించిన సమంత పెర్పార్మెన్స్ కి ఫిదా అవ్వాల్సిన పరిస్థితి.
సమంత హాట్ ఎలివేషన్స్..ఎక్స్ ప్రెషన్స్ సహా మాస్ లోకి దూసుకుపోయే పదజాలంతో సినిమా సక్సెస్ లో ఆ పాట కీలక పాత్ర పోషించింది. సోషల్ మీడియా సహా అన్ని మాధ్యమాల్ని ఆ పాట ఓ ఊపుఊపేసింది.
సమంత మార్క్ స్టెప్పులతో మెప్పించే ప్రయత్నాలు ఎన్నో జరిగాయి ఇప్పటికీ జరుగుతున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ మార్క్ సంగీతం మరోసారి హైలైట్ అయింది. తాజాగా ఈ పాట గురించి సమంత సంచలన వ్యాఖ్యలు చేసింది. `ఊ అంటావా మావ` పాటకి ప్రజలు నాపై చూపిస్తున్న ప్రేమని ఎప్పటికీ మర్చిపోలేను. ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు.
తెలుగు ప్రేక్షకుల కాదు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా గుర్తిస్తున్నారు. నేను గతంలో చేసిన సినిమాలన్నింటిని మర్చిపోయారు. ఊ అంటావామావ పాట వస్తే అందరికీ సమంతనే గుర్తొస్తుంది. అంతగా ఈపాట సక్సెస్ అయింది.
అందుకు ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. మొదట్లో ఈ పాటలో నటించడానికి ఆసక్తి చూపించలేదు. కమిట్ అవ్వాలా? లేదా? అని చాలాసార్లు ఆలోచించాను. కానీ ఈ పాట ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని దర్శకుడు సుకుమార్..సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ముందే ఊహించారు. అందుకే ఈ పాటలో నటించే అవకాశం నాకు కల్పించారు. ఈ సందర్భంగా వాళ్లకి కృతజ్ఞతలు``తెలిపింది సమంత.
మొత్తానికి సమంత పాన్ ఇండియా ఐటం భామగా ఫేమస్ అయిపోతుందని తానే స్వయంగా ఒప్పుకుంది. సమంత కెరీర్ కి ఇలాంటి ఇమేజ్ కెరీర్ ఎదుగుదలతో ఎంతో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలుగు మేకర్స్ పాన్ ఇండియా చిత్రాలపై దృష్టి నిలిపారు. హీరోలు సైతం పాన్ ఇండియా ఇమేజ్ కోసం వెంపర్లాడుతున్నారు.
ఇలాంటి సందర్భంలో సమంత పాన్ ఇండియా ఇమేజ్ మరిన్ని అవకాశాలకు పూల బాట వేసే అవకాశం ఉంది.
ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ఇటీవలే `శాకుంతలం` షూటింగ్ పూర్తిచేసింది. అలాగే మరో లేడీ ఓరియేంటెడ్ చిత్రం `యశోద` చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లింది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ కూడా పూర్తయింది. తెలుగు..తమిళ్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కన్నడ..మలయాళ..హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నారు.
అలాగే కోలీవుడ్ లో విజయ్ సేతుపతి సరసన `కథువకుల రెండు కాదల్` అనే సినిమాలోనూ నటిస్తోంది. `అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్` అనే విదేశీ చిత్రంలోనూ నటిస్తుంది.