సామ్ త‌న ట్రీట్మెంట్ మార్చేసిందా?

Update: 2022-11-27 02:30 GMT
క్రేజీ హీరోయిన్ సమంత ఉన్న‌ట్టుండి అనారోగ్యానికి గురి కావ‌డం.. తాను గ‌త కొంత కాలంగా మ‌యో సైటీస్ అనే వింత వ్యాధితో బాధ‌ప‌డున్నానంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా చేతికి సెలైన్ ఎక్కుతున్న ఫొటోని పోస్ట్ చేసి షాకిచ్చింది. ఉన్న‌ట్టుంది స‌మంత‌కు ఏమైందంటూ అమె అభిమానులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. ఇంత‌కీ మ‌యో సైటీస్ వ్యాధి అంటే ఉంటో తెలుసు కోవ‌డం.. గూగుల్ లో వెత‌క‌డం మొద‌లు పెట్టారు.

'య‌శోద‌' మూవీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లో భాగంగా తీవ్ర అనారోగ్యంతో వున్నా కానీ తాను డ‌బ్బింగ్ చెబుతున్న ఫోటోని షేర్ చేస్తూ షాకింగ్ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టింది. దీంతో స‌మంత అభిమానులు, శ్రేయోభిలాషులు సామ్ కు ఏం జ‌రుగుతోంది? ..ఏమైపోతోందంటూ భ‌యాందోళ‌న‌కు గురయ్యారు.

ఆ కార‌ణంగానే స‌మంత 'య‌శోద‌' ప్ర‌మోష‌న్స్ లో పాల్గొన‌లేక‌పోయింది. ఫైన‌ల్ గా సుమకు ప్ర‌త్యేకంగా ఓ వీడియో ఇంట‌ర్వ్యూ ఇచ్చిన సామ్ అందులో త‌న ఆరోగ్యంపై వ‌స్తున్న వార్త‌ల‌పై స్పందిస్తూ భావోద్వేగానికి గురైంది.

ఒక ద‌శ‌లో తానేమి చ‌నిపోలేద‌ని, ఇంకా బ్ర‌తికే వున్నాన‌ని చెబుతూ న‌వ్వేసింది. క‌ట్ చేస్తే.. 'య‌శోద‌' సినిమా రిలీజ్ అయిపోయింది. ఇంత‌కీ స‌మంత ఆరోగ్యం ఎలా వుంది?.. త‌న ట్రీట్మెంట్ ఎలా జ‌రుగుతోంది? అన్న విష‌యాల‌పై ఎలాంటి అప్ డేట్ లేదు. రీప‌సెంట్ గా స‌మంత మ‌ళ్లీ అనారోగ్యానికి గురైందంటూ వ‌రుస క‌థ‌నాలు పుట్టుకురావ‌డం.. అందులో ఎలాంటి నిజం లేదంటూ ఆమె టీమ్ వెల్ల‌డించ‌డం తెలిసిందే.  

అయితే ఇంత‌కీ సమంత ట్రీట్మెంట్ ఎలా జ‌రుగుతోంది? .. ఎక్క‌డ జ‌రుగుతోందనే విష‌యాలు తాజాగా బ‌య‌టికి వ‌చ్చాయి. స‌మంత‌కు ఇంగ్లీష్ మంద‌లు ప‌ని చేయ‌డం లేద‌ట. ప‌డ‌టం లేద‌ట‌. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే స‌మంత‌కు ఆయుర్వేద మందులు ప‌డుతున్నాయ‌ట‌. మంచి రిజ‌ల్ట్ ని చూపిస్తున్నాయ‌ట‌. అందుకే స‌మంత ట్రీట‌మ్మెంట్ విష‌యంలో ఇంగ్లీష్ మందుల్ని ప‌క్క‌న పెట్టేసి  ఆయుర్వేద మందులు వాడ‌టం మొద‌లు పెట్టార‌ట‌.  

ప్ర‌స్తుతం సామ్ కోలుకుంటున్నార‌ని, వచ్చే ఏడాది నుంచి సెట్స్ లో సంద‌డి చేయ‌డానికి రెడీ అవుతున్నార‌ని లేటెస్ట్ టాక్‌. త‌న కార‌ణంగా విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న 'ఖుషీ' మూవీ షూటింగ్ వాయిదా ప‌డుతూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి నుంచి ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ త‌దుప‌రి షెడ్యూల్ ప్రారంభం కానుంద‌ని, సామ్ సెట్స్ లోకి అడుగు పెట్ట‌నుంద‌ని ఇన్ సైడ్ టాక్‌. 



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News