మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే 'గాడ్ ఫాదర్' మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. దసరా పండుగ కానుకగా అక్టోబర్ 5న తెలుగుతో పాటు హిందీలోనూ ఈ చిత్రం భారీ ఎత్తున విడుదల కాబోతోంది. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కొణిదెల సురేఖ సమర్పణలో సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మించారు.
ఇందులో నయనతార, సల్మాన్ ఖాన్, సత్యదేవ్, సునీల్, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమన్ స్వరాలు అందించారు. మలయాళంలో మోహన్ లాల్ నటించిన 'లూసిఫర్' కు రీమేక్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'ఆచార్య' వంటి బిగ్గెస్ట్ డిజాస్టర్ అనంతరం చిరంజీవి నుంచి రాబోతున్న చిత్రమిది. ఈ మూవీతో ఆయన సక్సెస్ ట్రాక్ ఎక్కాలని మెగా అభిమానులు తెగ ఆరాటపడుతున్నారు.
ఇకపోతే ఈ సినిమా విషయంలో తాజాగా ఓ కొత్త సెంటిమెంట్ తెరపైకి వచ్చింది. అదే 'ఖైదీ నెంబర్ 150'. చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఇది. ఈ చిత్రానికి వి.వి. వినాయక్ దర్శకత్వం వహించగా.. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. తమిళ బ్లాక్ బస్టర్ హిట్ 'కత్తి' మూవీకి రీమేక్ ఇది. అయితే ఈ సినిమా సమయంలో ఎన్నో విమర్శలు వచ్చాయి.
అందుకు కారణం లేకపోలేదు. అప్పటికే కత్తి తెలుగు డబ్బింగ్ వెర్షన్‌ను ఇక్కడి ప్రేక్షకుల్లో చాలా మంది చూసేశారు. అలాంటి సినిమా రీమేక్ తో చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తున్నాడని ప్రకటించడంతో మెగా అభిమానులు సైతం నిరాశ వ్యక్తం చేశారు. కట్ చేస్తే 'ఖైదీ నెంబర్ 150' సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లను రాబట్టి దుమ్ము దులిపేసింది.
ఇక ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమా కూడా మలయాళ హిట్ 'లూసిఫర్'కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ ను సైతం చాలా మంది ప్రేక్షకులు చూసేశారు. అయినా సరే చిరంజీవి వెనక్కి తగ్గకుండా గాడ్ ఫాదర్ సినిమాను చేశారు.
ఈ నేపథ్యంలోనే గాడ్ ఫాదర్ విషయంలో 'ఖైదీ నెంబర్ 150' సెంటిమెంట్ రిపీట్ అవుతుందని, ఈ సారి చిరుకు సూపర్ హిట్ ఖాయమని మెగా అభిమానులు, పలువురు సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఈ అంచనాలు ఎంత వరకు నిజమవుతాయో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.