నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మోస్ట్ క్రేజీమెస్ట్ మూవీ `శ్యామ్ సింగ రాయ్`. నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా ఇది. `టాక్సీవాలా` ఫేమ్ రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వం వహించారు. నిహారిక ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయిన పల్లి అత్యంత ప్రతిష్టాత్మకంగా కేవలం హీరో నాని కోసమే చేసిన సినిమా ఇది. క్రేజీ భామలు సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ ఇందులో హీరోయిన్ లుగా నటించారు.
1970 పిరియడ్ లో కోల్‌కతాలో జరిగిన ఓ సంఘటనకి నేటి కాలానికి లింక్ చేస్తూ దేవ దాసీ వ్యవస్థని చూపిస్తూ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇందులో హీరో నాని రెండు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్నారు. ప్రధానంగా కథ కోల్‌కతా నేపథ్యంలో సాగే `శ్యామ్ సింగ రాయ్` పాత్ర చుట్టూ సాగుతుంది.
టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సరికొత్త స్క్రీన్ ప్లేతో ఈ సినిమా కథ నడుస్తుందని తెలుస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ చిత్రానికి ఉపయోగించిన స్క్రీన్ ప్లే చాలా టఫ్ అని చెబుతున్నారు.
విజువల్ ఎఫెక్ట్ ప్రధానంగా సాగే ఈ చిత్ర కథ రివర్స్ స్క్రీన్ ప్లే ప్రధానంగా సరికొత్త పంథాలో సాగుతుందని అర్థమవుతోంది. ఇది కొంత టఫ్ టాస్కే అయినా ప్రేక్షకుడిని కథలో లీనం చేసేంత వరకే అని, వన్స్ ప్రేక్షకుడు కథలో లీనమై ట్రావెల్ చేయడం మొదలైతే ఎలాంటి కన్ఫ్యూజన్ వుండదని స్క్రీన్ ప్లే స్పెషలిస్ట్ లు చెబుతున్నారు.
ఈ పంథాపై ట్రేడ్ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నా.. కథ, కథనాల్లో దమ్ముంటే అది పెద్ద సమస్యే కాదని, ప్రేక్షకుడు అర్థం చేసుకునే విధానాన్ని బట్టే సినిమా రేంజ్ కూడా డిసైడ్ అవుతుందని.. ప్రేక్షకుడికి స్క్రీన్ ప్లే పై క్లారిటీ ఏర్పడితే సినిమా మామూలు స్థాయికి వెళ్లదని.. పాన్ ఇండియా రేంజ్ లో రికార్డులు సృష్టించడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
డిసెంబర్ 24న అత్యంత భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా నేచురల్ స్టార్ నాని కెరీర్ ని సరికొత్త మలుపు తిప్పడం గ్యారంటీ అని.. ఈ సినిమాతో నటుడిగా నానికి సరికొత్త ఇమేజ్ రావడం ఖాయంగా కనిపిస్తోందని ఇండస్ట్రీ వర్గాలు నాని తరహాలోనే ధీమాని వ్యక్తం చేస్తుండటం విశేషం.