ఇండస్ట్రీలో ఎంత మంది స్టార్ ప్రొడ్యూసర్స్ వున్నా రామానాయుడు స్టూడియోస్, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి. సురేష్ బాబు వ్యవహార శైలి ప్రత్యేకం. ఎంతకంటే ప్రతీ సినిమా మార్కెట్ ని అంచనాల వేయడంలోనూ, ట్రెండ్ ని పసిగటటడంలోనూ ఆయన తరువాతే ఎవరైనా. గత కొన్ని నెలల క్రితం థియేటర్లకు అంత ఆదరణ వుండదని, ఓటీటీలే రాజ్యమేలుతాయని ఘంటాపథంగా వాదించారు. ఆయన చెప్పినట్టే ఇటీవల అక్షరాలా జరిగింది.
కరోనా కారణంగా థియేటర్లు తెరవకపోవడంతో జనం వినోదం కోసం ఓటీటీల బాట పట్టారు. రాను రాను వాటికే ప్రధానంగా ఎడిక్ట్ కావడంతో థియేటర్లకు వచ్చే వారి సంక్ష గణణీయంగా తగ్గుతూ వచ్చింది. అది జూన్, జూలై నెలల్లో ప్రధానంగా కనిపించి టాలీవుడ్ ప్రముఖులు భయాందోళనకు గురయ్యేలా చేసింది.ఈ విషయాన్ని ముందే పసిగట్టిన సురేష్ బాబు కరోనా థర్డ్ వేవ్ లో తాను నిర్మించిన సినిమాలని థియేటర్లకు కాకుండా ఓటీటీలక ఇచ్చేశారు.
వెంకటేష్ హీరోగా నిర్మించిన 'నారప్ప', 'దృశ్యం 2' సినిమాలని థియేటర్లలలో కాకుండా నేరుగా ఓటీటీలకు అమ్మేయడం తెలిసిందే. కంటెంట్ సాలీడ్ గా వున్న సినిమాలు కావడంతో ఈ రెండు సినిమాల కూడా ఓటీటీలో మంచి ఆదరణని సొంతం చేసుకుని సూపర్ హిట్ లు అనిపించుకున్నాయి. సురేష్ బాబు జడ్జిమెంట్ కరెక్ట్ అని ప్రూవ్ చేశాయి. మంచి లాభాలని అందించాయి. ఇక ఇదే ఫార్ములాతో సురేష్ బాబు రీసెంట్ గా రానా, సాయి పల్లవి జంటగా వేణు ఊడుగుల రూపొందించిన 'విరాటపర్వం'ని కూడా ఓటీటీకే ఇచ్చేయాలనుకున్నారట.
కానీ మరో ప్రొడ్యూసర్ మాత్రం ఆయన నిర్ణయంతో ఏకీభవించలేదని, దాంతో ఈ మూవీని ఓటీటీకి బదులు థియేటర్లలో రిలీజ్ చేసి చేతులు కాల్చుకున్న విషయం తెలిసిందే. ఇదిలా వుంటే ఇంత కాలం ఓటీటీలకే జై కొట్టి డి. సురేష్ బాబు ఇప్పడు సడన్ గా థీయేటర్ల వైను చూస్తున్నారట. రీసెంట్ గా ఆయన ఓ కొరియన్ మూవీ ఆధారంగా 'శాకిని - డాకిని' అనే మూవీని సుధీర్ వర్మ డైరెక్షన్ లో సునీత తాటితో కలిసి నిర్మించారు.
రెజీనా, నివేదా థామస్ నటించిన ఈ మూవీని ముందు ఓటీటీ కంపనీకే ఇచ్చేశారట. అయితే తాజాగా తమన మనసు మార్చుకున్నారని తెలిసింది. రీసెంట్ గా విడుదలైన 'బింబిసార', సీతారామం, కార్తికేయ 2 సినిమాలు థియేటర్లలో కలెక్షన్ ల దుమ్ము దులిపేస్తున్నాయి.
ఇదే ఇప్పడు సురేష్ బాబు లో ధైర్యాన్ని నింపిందట. దీంతో ఆయన తన సినిమాని సడన్ గా థియేటర్లలో రిలీజ్ చేయాలని మనసు మార్చుకున్నారని ఈ మూవీని సెప్టెంబర్ 16న విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారని తెలిసింది. తాజా పరిణామాల నేఫథ్యంలో సురేష్ బాబు మళ్లీ యాక్టీవ్ అవుతున్నట్టేనా? అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. గిల్డ్ బంద్ సందర్భంగానూ పెదవి విప్పని సురేష్ బాబు ఈ మూవీతో మళ్లీ యాక్టీవ్ అవుతున్నారని తెలుస్తోంది.