సినిమా ఇండస్ట్రీలో హీరోలు.. రచయితలు దర్శకులుగా మారిన సందర్బాలు చాలా ఉన్నాయి. నిర్మాతలు.. సంగీత దర్శకులు ఇతర టెక్నికల్ విభాగాల్లో చేసిన వారు కూడా దర్శకులు అయ్యారు. కాని హీరోయిన్స్ గా చేసిన వారు దర్శకులుగా చేసింది మాత్రం అతి తక్కువ మంది. ఇండియన్ సినీ చరిత్రలో అతి కొద్ది మంది హీరోయిన్స్ మాత్రమే దర్శకురాళ్లుగా మారి పేరు దక్కించుకున్నారు. దర్శకత్వం చేసిన హీరోయిన్స్ అతి కొద్ది మందే కాగా.. అందులో ఇంకా కొద్ది మంది మాత్రమే సక్సెస్ అయ్యారు.
ఎక్కువ శాతం మంది ప్లాప్ అయ్యారు. అలాంటి దర్శకత్వంపై ట్యాలెంటెడ్ బ్యూటీ హీరోయిన్ నివేతా పేతురాజ్ ఆశలు పెట్టుకుంది. తెలుగు మరియు ఇతర భాషల్లో వరుసగా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు మెల్ల మెల్లగా స్టార్ హీరోలకు చేరువ అవుతుంది. ఈ సమయంలో ఆమె హీరోయిన్ గా మంచి ఆఫర్లు దక్కించుకోవడం ఖాయం అనుకుంటున్న సమయంలో తనకు దర్శకత్వంపై ఆసక్తి ఉన్నట్లుగా ప్రకటించింది.
ఇటీవల ఆమె ఒక చిట్ చాట్ లో తనకు దర్శకత్వంపై ఆసక్తి ఉందని.. చాలా కాలంగా దర్శకత్వం చేయాలనే కోరిక నాలో ఉందని.. నా డ్రీమ్ డైరెక్టర్ గా మంచి సినిమాలు చేయాలి.. వాటికి విమర్శకుల నుండి ప్రశంసలు దక్కించుకోవాలి. తాను ఎంతో కాలంగా ఈ విషయమై ఆలోచిస్తున్నాను అని... ఇప్పటికే స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకుంటున్నట్లుగా సన్నిహితుల వద్ద నివేత చెప్పుకొచ్చింది. హీరోయిన్ గా వరుసగా ఆఫర్లు వస్తున్న ఈ సమయంలో ఆమె దర్శకత్వం వైపు అడుగులు వేయక పోవచ్చు. కాని భవిష్యత్తులో అయినా ఆమె దర్శకత్వం చేయాలని ప్రయత్నాలు చేస్తోంది.
సినిమా ఇండస్ట్రీలో అతి కొద్ది మంది మాత్రమే లేడీ డైరెక్టర్స్ ఉన్నారు కనుక ఈమె దర్శకురాలిగా మారి మంచి సినిమాలు చేస్తే ఖచ్చితంగా మంచి పేరు వస్తుంది. అయితే ఈమె దర్శకత్వంలో హీరోలు నటించేందుకు ముందుకు రావాల్సి ఉంది. మొదట కొత్త హీరోలతో లేదా చిన్న హీరోలతో మంచి కథలతో సినిమాలు చేస్తే ఆ తర్వాత స్టార్ హీరోలు వారంతట వారే క్యూ కడతారు. కనుక కష్టపడి స్క్రిప్ట్ విషయంలో బాగా వర్క్ చేస్తే నివేతా డ్రీమ్ నెరవేరడం పెద్ద కష్టం ఏమీ కాదని సినీ విశ్లేషకులు మరియు మీడియా సర్కిల్స్ వారు కామెంట్స్ చేస్తున్నారు.