పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్ లో తొలి సారి చేస్తున్న పీరియాడిక్ ఫిక్షన్ మూవీ 'హరి హర వీరమల్లు'. క్రిష్ జాగర్ల మూడీ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం సమర్పణలో ఏ. దయాకర్ రావు ఈ మూవీని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోగా నటిస్తున్నఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటిస్తోంది. ఇక కీలక విలన్ పాత్రలో అర్జున్ రాంపాల్ కనిపించనున్న విషయం తెలిసిందే.
17 శతాబ్దంలోని మోఘల్ సామ్రాజ్య కాలం నాటి కథతో ఓ ఫిక్షనల్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు యాభై శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ తదుపరి షెడ్యూల్ ప్రారంభం కావాల్సి వుంది. అయితే గత కొన్ని నెలలుగా పవన్ కల్యాణ్ జనసేన పార్టీ కార్యకలాపాల్లో బిజీగా వుండటం వల్ల ఈ మూవీ షూటింగ్ తదుపరి షెడ్యూల్ నిరవధికంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవలే తదుపరి షెడ్యూల్ కోసం ప్రత్యేకంగా వర్క్ షాప్ లో టీమ్ తో కలిసి పవన్ కల్యాణ్ పాల్గొన్న విషయం తెలిసిందే.
ఇదిలా వుంటే ఇటీవలే పార్టీ కార్యక్రమాల కోసం వైజాగ్ వెళ్లిన పవన్ కల్యాణ్ తనదైన వ్యాఖ్యలతో సంచలనం సృష్టించారు. దీంతో అక్కడ రాజకీయ వేడి రాజుకుంది. తాజా పరిణామాల నేపథ్యంలో పవన్ 'హరి హర వీరమల్లు' తాజా షెడ్యూల్ ని ప్రారంభించడానికి మరి కాస్త టైమ్ తీసుకునే అవకాశం వుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన అంశం తాజాగా బయటికొచ్చి ఫ్యాన్స్ కి ఆనందాన్ని కలిగిస్తోంది.
ఈ మూవీలో పవన్ కల్యాణ్ రాబిన్ హుడ్ తరహాలో సాగే బందిపోటు దొంగగా కనిపించనున్న విషయం తెలిసిందే. మొఘల్ సామ్రాజ్యంలో వున్న కోహినూర్ వజ్రం చుట్టూ ఈ మూవీ కథ సాగుతుందని తెలుస్తోంది.
అయితే ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ క్లైమాక్స్ లో రివీల్ కానుందని, అది పవ్ కల్యాణ్ మనస్తత్వానికి చాలా దగ్గరగా వుంటుందని చెబుతున్నారు. అదే సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలుస్తుందని, ఇది ఫ్యాన్స్ ని మరింత ఆనందాన్ని కలిగించి సర్ ప్రైజ్ చేస్తుందని ఇన్ సైడ్ టాక్.
ఇదిలా వుంటే ఈ మూవీతో పాటు పవన్ కల్యాణ్ మరో రెండు రీమేక్ సినిమాలని లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. విజయ్ హీరోగా నటించిన 'తేరీ' మూవీతో పాటు సముద్రఖని నటించి తెరకెక్కించిన 'వినోదాయ సితం' రీమేక్ లోనూ నటించబోతున్నారు. 'తేరీ' రీమేక్ ని డీవీవీ దానయ్య నిర్మించనుండగా సుజీత్ డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇక సముద్రఖని నటించి తెరకెక్కించిన 'వినోదాయ సితం'ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మించనున్నారు. దీనికి సముద్రఖని దర్శకత్వం వహించబోతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.