స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు దాదాపు పుష్కర కాలం తరువాత కలిసి మళ్లీ వర్క్ చేస్తున్నారు. SSMB28 అనే వర్కింట్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ ఎస్. రాధాకృష్ణ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా? అని ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూశారు.
వారి ఎదురుచూపులకు తెరదించుతూ ఎట్టకేలకు ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ 12న అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో మొదలైంది. అతడు, ఖలేజా వంటి సినిమాల తరువాత త్రివిక్రమ్, మహేష్ ల కలయికలో రానున్న సినిమా కావడంతో అభిమానులు ఈ ప్రాజెక్ట్ పై అమితాసక్తిని చూపిస్తున్నారు. చాలా ప్రత్యేకంగా ఈ మూవీ వుంటుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అభిమానుల అంచనాలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో ఈ మూవీని అత్యంత భారీగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
అన్నపూర్ణ స్టూడియోస్ లో మహేష్ తో పాటు కొంత మంది ఫైటర్స్ పాల్గొనగా అన్బు అరివుల నేతృత్వంలో భారీ యాక్షన్ సీక్వెన్స్ తో రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించారు. మొత్తానికి ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది. త్వరలో సెకండ్ షెడ్యూల్ ని మొదలు పెట్టబోతున్నారు. ఈ షెడ్యూల్ లో హీరోయిన్ పూజా హెగ్డే ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఇదిలా వుంటే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతున్న సందర్భంగా మేకర్స్ #SSMB28Aarambham పేరుతో ఓ వీడియోని విడుదల చేశారు.
దీంతో ఈ మూవీకి 'ఆరంభం' అనే టైటిల్ ని మేకర్స్ ఫైనల్ చేసే ఆలోచనలో వున్నారంటూ నెట్టింట ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంపై మేకర్స్ స్పందించలేదు. పెద్దగా పట్టించుకోలేదు కూడా. అయితే తాజాగా ఈ మూవీకి మరో పవర్ ఫుల్ టైటిల్ ని ఫైనల్ చేశారంటూ ప్రచారం మొదలైంది. ఈ మూవీకి త్రివిక్రమ్ 'అ' సెంటిమెంట్ ప్రకారం 'అయోధ్యలో అర్జునుడు' అనే పవర్ ఫుల్ టైటిల్ ని త్రివిక్రమ్ ఫైనల్ చేయాలనే ఆలోచనలో వున్నారని చెబుతున్నారు.
త్రివిక్రమ్ సినిమా టైటిల్ కు అ సెంటిమెంట్ వున్న విషయం తెలిసిందే. అతడు, అఆ, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి, అల వైకుంఠపురములో వంటి సినిమాల టైటిల్స్ 'అ'తో మొదలైనవి కావడంతో ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతున్న 'అయోధ్యలో అర్జునుడు' SSMB28 టైటిల్ అంటూ ప్రచారం చేస్తున్నారు. అప్పట్లో 'అత్తారింటికి దారేది' టైటిల్ ని వైరల్ గా సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన తరువాతే ఫైనల్ చేశారు. ఇది కూడా అలాగే ఫైనల్ చేస్తారని నెటిజన్ లు కామెంట్ లు చేస్తున్నారు.. మరి త్రివిక్రమ్ ఈ సారి ఏం చేస్తాడో వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.