రౌడీస్టార్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 'జనగణమన' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఆర్మీ వార్ బ్యాక్ డ్రాప్ స్టోరీ. పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోంది. శ్రీకర స్టూడియోస్-పూరి కనెక్స్ట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. లైగర్ రిలీజ్ కి ముందే చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లి పూరి తన కాన్పిడెన్స్ ని మరోసారి రివీల్ చేసారు.
లైగర్ ఫలితంతో సంబంధం లేకుండా జనగణమనని తెరకెక్కిస్తున్నారు. లైగర్ రిలీజ్ అయిన అనంతరం పూరి అండ్ టీమ్ జనగణమన బిజీలో పడతారు. అయితే ఈ సినిమా ఇప్పటికే ఓ షెడ్యూల్ ని సైతం పూర్తిచేసినట్లు తెలుస్తోంది. పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో కేవం కథ బలంగానే సాగుతుందని అంతా అనుకున్నారు. కానీ సినిమా లో కథతో పాటు భారీ తనం కనిపిస్తుందని తెలుస్తోంది.
సినిమా కోసం భారీ గా బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో చిత్రాన్ని సదరు సంస్థలు నిర్మిస్తున్నాయట. ఇందులో పూరి సొంత నిర్మాణ సంస్థతో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా నిర్మా ణంలో భాగమయ్యారు. ఈ సినిమాతోనే వంశీ నిర్మాతగా మారుతున్నారు. తొలి ప్రయత్నంలోనే భారీగా వెచ్చిస్తున్నారు.
ఇదంతా కేవలం పూరిపై ఉన్న నమ్మకంతోనేనని తెలుస్తోంది. ఇండియాలో వివిధ లొకేషన్లతో పాటు..విదేశాల్లోనూ కీలక షెడ్యూల్స్ ఉంటాయని తెలిసింది. షూటింగ్ కోసమే దాదాపు 5 నెలలకు పైగా సమయం పడుతుందిట. అటుపై పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువగానే సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇప్పటికే చిత్రాన్ని ఆగస్ట్ 3న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అంటే సినిమా పూర్తిచేసి రిలీజ్ చేయడానికి దాదాపు ఏడాది సమయం పడుతుందని తెలుస్తోంది.
పూరి ఇంత డిలే ఏ సినిమా విషయంలోనూ చేయలేదు. ఇప్పటివరకూ ఎంతో మంది స్టార్ హీరోల్ని డైరెక్ట్ చేసారు. ఎనిమిది నెలల్లోనే అన్ని పనులు పూర్తి చేసి ఆ సినిమాని రిలీజ్ చేసారు. కానీ ఏడాది సమయం తీసుకుని 'జనగణమన' చేస్తున్నారంటే? అతనెంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారో అద్దం పడుతుంది.
ఇకపై ఓ కొత్త పూరిని చూస్తారని ఇప్పటికే ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 'లైగర్' విజయం సాధిస్తే 'జనగణమన' కి మరింత ఉత్సాహంగా పనిచేస్తారు. ఆ సినిమా ఫలితం జనగణమన మార్కెట్ కి కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. మరి 'జెజీఎమ్' విషయంలో 'లైగర్' ఎలాంటి పాత్ర పోషిస్తుందో? మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.