'పుష్ప 2' మేజ‌ర్ షూట్ అంతా అక్క‌డేనా?

Update: 2022-10-30 02:30 GMT
అల్లు అర్జున్ న‌టించిన యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ 'పుష్ప ది రైజ్‌'. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ అత్యంత భారీ స్థాయిలో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ మూవీ దేశ వ్యాప్తంగా సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. అంతే కాకుండా హీరోగా బ‌న్నీ స్థాయిని పెంచ‌డ‌మే కాకుండా త‌న‌ని ఉన్న ప‌లంగా పాన్ ఇండియా స్టార్ ని చేసింది. వ‌ర‌ల్డ్ వైడ్ గా ఈ మూవీలోని పాట‌లు, పుష్ప సిగ్నేచ‌ర్ స్టెప్‌, మేన‌రిజ‌మ్స్ వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే.

ఉత్త‌రాదిలో ఊహ‌కంద‌ని విధంగా ఈ సినిమా వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డంతో మేక‌ర్స్ పార్ట్ 2 విష‌యంలో భారీ మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టారు. తొలి భాగం సంచ‌ల‌న విజ‌యాన్ని ద‌క్కించుకున్న నేప‌థ్యంలో పార్ట్ 2పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఆ అంచ‌నాల‌ను దృష్టిలో పెట్టుకోవ‌డ‌మే కాకుండా 'కేజీఎఫ్ 2' రికార్డు స్థాయిలో విజ‌యాన్ని సొంతం చేసుకున్న తీరుని కూడా ప‌రిశీలించిన ద‌ర్శ‌కుడు సుకుమార్ 'పుష్ప 2' స్క్రిప్ట్ లో భారీ మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టారు.

స్టోరీని ఫైన‌ల్ గా లాక్ చేయ‌డం కోసం చాలా స‌మ‌యం భారీ క‌స‌ర‌త్తులు చేసిన సుకుమార్ ఎట్ట‌కేల‌కు ఫైన‌ల్ డ్రాఫ్ట్ ని పూర్తి చేశారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ ని య‌మ స్పీడుగా మొద‌లు పెట్టిన సుకుమార్ త్వ‌ర‌లోనే సినిమాని ప‌ట్టాలెక్కించ‌బోతున్నారు. ఆ మ‌ధ్య లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాలు పూర్తి చేసిన చిత్ర బృందం సినిమా ప్రారంభంపై క్లారిటీ ఇవ్వ‌లేదు. అయితే త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ ని ప్రారంభించ‌బోతున్నార‌ని తెలుస్తోంది.

ముందు అనుకున్న ప్లాన్ ప్ర‌కారం ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ని హైదరాబాద్ లో ప్రారంభించి రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేయ‌నున్నార‌ట‌. ఆ త‌రువాత టీమ్ కీల‌క ఘ‌ట్టాల చిత్రీక‌ర‌ణ కోసం బ్యాంకాక్ వెళ్ల‌నున్న‌ట్టుగా తెలుస్తోంది. అక్క‌డే రెండు నెల‌ల పాటు షూటింగ్ చేయ‌నున్నార‌ట‌. ప్ర‌ధాన తారాగ‌ణం మొత్తం ఈ షెడ్యూల్ కోసం బ్యాకాంక్ వెళ్ల‌బోతున్నార‌ని, కీల‌క షూటింగ్ పూర్త‌య్యేంద వ‌ర‌కు ఎలాంటి బ్రేక్ ని టీమ్ తీసుకోవ‌డం లేద‌ని, బ్యాంకాక్ అడ‌వుల్లో గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్లింగ్ కి సంబంధించిన స‌న్నివేశాల‌ని చిత్రీక‌రించ‌బోతున్నార‌ని ఇన్ సైడ్ టాక్.

అంతే కాకుండా ఓ కీల‌క షెడ్యూల్ ని మారేడుమిల్లిలోనూ చేయ‌బోతున్నార‌ట‌. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీకి దేవి శ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందించనున్నాడు. ఫహ‌ద్ ఫాజిల్, ధ‌నుంజ‌య‌, సునీల్‌, అన‌సూయ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మించ‌బోతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News