దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రాంచరణ్ కథానాయకులుగా నటిస్తున్నారు. చారిత్రాత్మక ధీరుల జీవితాల నేపథ్యంలో సిద్ధం అవుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా, రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నాడు. నిజానికి రోజురోజుకి ఆర్ఆర్ఆర్ సినిమా పై ప్రేక్షకులలో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే సినిమా విడుదల తేదీని ఎప్పుడైతే ప్రకటించిందో అప్పుడే మొదలయింది సందడి. ఈ ఏడాది దసరా కానుకగా ఆర్ఆర్ఆర్ మూవీని అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్, ఎన్టీఆర్ జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ నుండి విడుదలైన మోషన్ పోస్టర్స్, ఇంట్రడక్షన్ ప్రోమో వీడియోస్ సినిమా పై విపరీతంగా బజ్ క్రియేట్ చేసేసాయి. తాజాగా సినిమాకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ షూటింగ్ జరుగుతుందనే సంగతి తెలిసిందే. అయితే రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో రాజమౌళి బృందం.. షూటింగ్ ముగించుకున్న సీన్స్ ఎడిట్ చేసే పనిలో పడ్డారట. ఇందులో భాగంగా హీరోయిన్ శ్రీయ కూడా నటించిన సీన్స్ కట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు టాక్. ఈ సినిమాలో అజయ్ దేవగన్ గురువు పాత్రను పోషించగా.. శ్రీయ గురువుకు భార్య పాత్రను పోషించిందట. అయితే శ్రీయకు సంబంధించిన సీన్స్ తొలగించడం పై కారణం ఏంటో తెలియదు గాని శ్రీయకు అన్యాయం చేస్తున్నారంటూ పుకార్లు మాత్రం వైరల్ అవుతూనే ఉన్నాయి. చూడాలి మరి డైరెక్టర్ ఏం నిర్ణయం తీసుకున్నాడో..!