టాలీవుడ్ లో ఆయనో స్టార్ ప్రొడ్యూసర్. భారీ చిత్రాలని ఇండస్ట్రీకి అందించిన ప్రొడక్షన్ కంపనీ ఆయనది. కానీ గత కొంత కాలంగా సినిమాలు నిర్మించడం లేదు. జనరేషన్ మారింది. దీంతో ఆయన కూడా తనని తాను అప్ డేట్ చేసుకుంటూ యంగ్ జనరేషన్ తో పోటీపడుతూ నేటి ట్రెండ్ కు అనుగుణంగా సినిమాలు నిర్మించాలని కొత్త బాట పట్టారు. ఇందు కోసం ఓ యంగ్ ప్రొడ్యూసర్ ని అసోసియేట్ చేసుకుని తాను సమర్పకుడిగా వ్యవహరిస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు నిర్మిస్తున్నారు.
వినూత్నమైన కథాంశాలతో యంగ్ టాలెంట్ ని ప్రోత్సహిస్తూ సినిమాలు చేస్తున్నారు. అప్పుడప్పుడు కొత్త తరహా చిత్రాలకు అండగా నిలుస్తూ సదరు సినిమాలని రిలీజ్ చేస్తున్నారు.. యంగ్ మేకర్స్ కి తన వంతు సహాయ సహకారాల్ని అందిస్తున్నారు. అయితే అంతే బాగానే వుంది కానీ తాజాగా సదరు స్టార్ ప్రొడ్యూసర్ చేసిన పని ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఆయన సమర్పకుడిగా వ్యవహరిస్తూ తాజాగా ఓ కమర్షియల్ ఎంటర్ టైనర్ ని నిర్మించారు.
సినిమా కూడా బాగా వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. బజ్ కూడా బాగానే క్రియేట్ అవుతోంది. పేరున్న హీరో నటించిన ఈ మూవీ రిలీజ్ కూడా దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం గత వారం రోజులుగా ప్రమోషన్స్ తో అదరగొట్టేస్తున్నారు.
ఇదిలా వుంటే సదరు స్టార్ ప్రొడ్యూసర్ తను నిర్మించిన సినిమా రిలీజ్ కి ముందే మరో చిన్న సినిమాని కూడా సపోర్ట్ చేస్తూ రిలీజ్ చేస్తున్నారు. థియేటర్లని ఈ మూవీ కి కేటాయించడమే ఇప్పడు ప్రధాన సమస్యగా మారింది.
త్వరలో రిలీజ్ కానున్న తన సినిమాకు థియేటర్ల ఎఫెక్ట్ పడుతుందని భావించకుండా చిన్న సినిమాకు థియేటర్లు కేటాయించడం ఇప్పడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. స్టార్ ప్రొడ్యూసర్ గా పేరున్న ఆయన ఇలా తన సినిమా కోసం కేటాయించిన థియేటర్లని చిన్న సినిమాకు కేటాయించి రిస్క్ చేస్తున్నారేంటీ? అని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే ఇలా చిన్న సినిమాకు సీనియర్ స్టార్ ప్రొడ్యూసర్ థియేటర్లు కేటాయించడం వెనక ఉద్దేశ్యం వేరే వుందట.
ఇదే హీరోతో తదుపరి చిత్రాన్ని చేస్తున్నారు కాబట్టి సదరు చిన్న హీరో సినిమాకు స్టార్ ప్రొడ్యూసర్ థియేటర్లు కేటాయించారట. ఈ మూవీ హిట్టయితే తదుపరి ఆయన చేస్తున్న సినిమాకు ప్లస్ అవుతుంది కాబట్టి ఆ స్వార్థం వల్లే తమ సినిమా రిలీజ్ కాబోతున్నా థియేటర్లని చిన్న సినిమాకు కేటాయించారని, చెప్పాలంటే సీనియర్ స్టార్ ప్రొడ్యూసర్ పరంగా ఇదొక కమర్షియల్ గేమ్ ప్లానే అని ఇన్ సైడ్ టాక్.