అప్ కమింగ్ హీరో రెండో పెళ్లికి రెడీ అయ్యాడా..?

Update: 2022-09-03 13:30 GMT
ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో అనేక జంటలు అర్థాంతరంగా తమ వైవాహిక జీవితాలకు స్వస్తి పలుకుతూ విడాకులు ప్రకటించిన సంగతి తెలిసిందే. సెలబ్రిటీల విడాకుల పర్వం బాలీవుడ్ నుంచి టాలీవుడ్ - కోలీవుడ్ వరకూ కొనసాగింది. ఇదే క్రమంలో ఓ సెలబ్రిటీ కపుల్ డివోర్స్ గురించి చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి.

టాలీవుడ్ లో ఓ పెద్ద ఫ్యామిలీకి చెందిన అమ్మాయి.. అప్ కమింగ్ హీరో అయిన తన భర్తతో విడాకులు తీసుకోబోతోందని సోషల్ మీడియాలో రూమర్స్ వచ్చాయి. అయితే తాజాగా ఈ విడాకుల వ్యవహరంలో మరో కొత్త పుకారు సంచలనం రేపుతోంది. అదేంటంటే ఆ హీరో ఇప్పుడు రెండో పెళ్లి కోసం రెడీ అవుతున్నారని అంటున్నారు.

సెలబ్రిటీ కపుల్ మధ్య మనస్పర్థలు రావడంతో చాలా కాలంగా దూరంగా ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. ఇద్దరూ ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంటున్నారు. గత కొన్ని నెలలుగా కలిసి కనిపించకపోవడం.. సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ ఫాలో చేసుకోవడం.. హీరో సినిమాలకు సపోర్ట్ చేయకపోవడం వంటివి వీరి విడాకుల వార్తలకు బలం చేకూర్చాయి.

విడాకులను ఇప్పటి వరకు ఇరు వర్గాలు అధికారికంగా ధృవీకరించలేదు. ఇందులో ప్రమేయం ఉన్న జంట మౌనం వీడలేదు. నెట్టింట ఇన్ని పుకార్లు షికార్లు చేస్తున్నా ఎలాంటి స్పందన లేదు. సమర్ధించడం కానీ ఖండించడం కానీ చేయలేదు. ఈ నేపథ్యంలో ఆమె మరో పెళ్లికి రెడీ అయిందనే రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు హీరో కూడా మళ్లీ పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి.

అతను తనకు మరదలు వరసయ్యే అమ్మాయి మెడలో తాళి కట్టనున్నాడని అంటున్నారు. తన భార్య మూడో వివాహం చేసుకోనుందని వార్తలు వస్తున్న నేపథ్యంలోనే.. ఆమె కంటే ముందు తాను వివాహం చేసుకోవాలని భావిస్తున్నాడని.. అందుకే రెండో పెళ్లికి సిద్ధమయ్యాడని చెబుతున్నారు.
 
నిజానికి ఈ జంట అధికారికంగా విడాకులు తీసుకొని చాలా రోజులు అవుతుందట. ఈ ప్రక్రియ అంతర్గతంగా వ్యక్తిగతంగా జరగనున్నందున రెండు కుటుంబాలు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదట. అంతేకాదు ఈ వ్యవహారం పిల్లలపై ప్రభావం పడకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ఇలాంటి జాగ్రతలు తీసుకున్నారని అంటున్నారు.

ప్రస్తుతం వేర్వేరు మార్గాల్లో ప్రయాణిస్తున్న వీరిద్దరూ.. త్వరలోనే మరొకరితో జీవితాన్ని పంచుకోనున్నారని పుకార్లు పుట్టుకొస్తున్నాయి. ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో ఈ వార్తలే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News