దర్శకధీరుడు రాజమౌళి 'బాహుబలి' సినిమా తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకొని యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో 'ఆర్ఆర్ఆర్' (రౌద్రం రణం రుధిరం) చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. టాలీవుడ్ లో భారీ మల్టీస్టారర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రామ్ చరణ్ 'అల్లూరి సీతారామ రాజు' రోల్ పోసిస్తుండగా తారక్ 'కొమరం భీమ్' పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హాలీవుడ్ నటీనటులతో పాటు బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, అలియా భట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిలుపుదల చేసుకుంది. యావత్ భారతదేశ సినీ అభిమానులు 'ఆర్.ఆర్.ఆర్' సినిమా కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. 'ఆర్.ఆర్.ఆర్.' సినిమాని కూడా తన గత సినిమాకు దీటుగా మార్కెట్ చేయాలని రాజమౌళి భావిస్తున్నాడు. ఈ చిత్రానికి ఉన్న హైప్ వల్ల చాలా మంది ఇప్పటికే ఈ సినిమాను ఫ్యాన్సీ రేట్ కి అగ్రిమెంట్ చేసుకొని.. అందులో చాలా మొత్తం అడ్వాన్స్ ఇచ్చి సొంతం చేసుకున్నారని సమాచారం.
అయితే ఇప్పుడు ఇంత మొత్తంలో సినిమా రాబడుతుందో లేదో అని వారు ఆలోచిస్తున్నారట. కరోనా మహమ్మారి వల్ల సినీ ఇండస్ట్రీపై కోలుకోలేని దెబ్బ పడింది. ఈ సంక్షోభం నుండి బయటపడటానికి చాలా సమయం పడుతుంది. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత సినీ ఇండస్ట్రీలో చాలా మార్పులు చోటు చేసుకోబోతున్నాయంటూ ఇప్పటికే ఇండస్ట్రీ పెద్దలు చెప్తూ ఉన్నారు. లాక్ డౌన్ తర్వాత జనాలు ఒకప్పటిలా సినిమాలు చూడటానికి థియేటర్స్ కి వచ్చే పరిస్థితులు ఉండకపోవచ్చు. ఇప్పటికే ఉపాధి లేక ఇంటికే పరిమితమైన జనాలు ఎంటర్టైన్మెంట్ కోసం విరివిరిగా ఖర్చు చేసే అవకాశం లేదు. ఒక్క రూపాయి ఖర్చు చేయాలన్నా ఆచితూచి అడుగులు వేసే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో ఈ ఎఫెక్ట్ సినిమా కల్లెక్షన్స్ పై ఖచ్చితంగా పడుతుందని చెప్పవచ్చు. ఇక భారీ బడ్జెట్ సినిమా పరిస్థితి కూడా అంతకు మించి ఎఫెక్ట్ అవుతాయి. అందుకే ఆర్.ఆర్.ఆర్ సినిమాకి అడ్వాన్స్ ఇచ్చిన వారు ఇదే ఆలోచిస్తున్నారట. అంతేకాకుండా అంత పెద్ద మొత్తాలని వెనక్కి రాబట్టడ్డం చాలా కష్టమని.. కొంత డిస్కౌంట్ ఇవ్వాలని దానయ్య అండ్ కో పై కొన్నవాళ్ళు వాళ్లు ప్రెజర్ పెడుతున్నట్టు సమాచారం. దీనిని బట్టి చూస్తే 'రౌద్రం రణం రుధిరం' లెక్కల్లో కూడా మార్పులు ఉండే అవకాశం ఉందని చెప్పవచ్చు.