బాలీవుడ్ కు అక్క‌డ కూడా షాకేనా?

Update: 2022-08-27 01:30 GMT
బాలీవుడ్ ఇండస్ట్రీ గ‌త రెండేళ్లుగా తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. గ‌త మెంతో ఘ‌న‌కీర్తి అన్న‌ట్టుగా బాలీవుడ్ అంటేనే ఇండియ‌న్ సినిమా అనిపించుకుని ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. కానీ ఇప్పుడు ప‌రిస్థితి అందుకు పూర్తి భిన్నంగా క‌నిపిస్తోంది. ఇందుకు సుశాంత్ సింగ్ ఆక‌స్మిక మ‌ర‌ణం కూడా ఓ కార‌ణంగా నిలుస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి త‌రువాత బాలీవుడ్ పై ఉత్త‌రాది ప్రేక్ష‌కుల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతూ వ‌స్తోంది.  

దీంతో హిందీ సినిమాలకు పెద్ద‌గా ఆద‌ర‌ణ ద‌క్క‌డం లేదు. దీనికి తోడు బాయ్ కాట్ బాలీవుడ్ నినాదం కూడా దావాన‌ళంలా వ్యాపించ‌డంతో బాలీవుడ్ మునుపెన్న‌డూ చూడ‌ని గ‌డ్డు ప‌రిస్థితుల్ని ఎదుర్కొంటూ వ‌స్తోంది. రీసెంట్ గా విడుద‌లైన సినిమాలేవీ బాక్సాఫీస్ వ‌ద్ద రాణించ‌లేక‌పోతున్నాయి. స్టార్స్ న‌టించిన సినిమాల‌కూ ఇదే ప‌రిస్థితి త‌లెత్త‌డంతో బాలీవుడ్ ప్రొడ్యూస‌ర్స్ కోట్ల‌ల్లో న‌ష్ట‌పోతున్నారు. బాయ్ కాట్ వివాదం కార‌ణంగా అమీర్ ఖాన్ న‌టించిన `లాల్ సింగ్ చ‌డ్డా`, అక్ష‌య్ కుమార్ న‌టించిన `ర‌క్షాబంధ‌న్‌` బాక్సాఫీస్ వ‌ద్ద నిల‌బ‌డ‌లేక‌పోయాయి.

అంత‌కు ముందు భారీ స్థాయిలో విడుద‌లైన `స‌మ్రాట్ పృథ్విరాజ్` ప‌రిస్థితి కూడా దారుణంగానే క‌నిపించింది. ఇదిలా వుంటే ఇప్పుడు బాలీవుడ్ కు అక్క‌డ కూడా బారీ షాక్ త‌గులుతున్న‌ట్టుగా తెలుస్తోంది. బుల్లితెర‌పై ఈ సినిమాల‌క చెప్పుకోద‌గ్గ రేటింగ్ లు న‌మోదు కాక‌పోవ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. 2021లో విడుద‌లైన దాదాపు 43 సినిమాల‌కు స‌గుటున రేటింగ్ కేవ‌లం 5.9, 18 సినిమాల‌క 7.3 రేటింగ్ ల‌భించ‌గం గ‌మ‌నార్హం.

తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఎకాన‌మి రీసెర్చ్ తాజా గ‌ణాంకాల‌ని వెల్ల‌డించింది. ఇక దీనికి తోడు మిందీ సినిమాల‌కు వినోద‌పు ప‌న్ను అధికంగా విధించ‌డం వ‌ల్ల కూడా టికెట్ ధ‌ర‌లు భారీగా పెరిగాయ‌ని, అందు వ‌ల్లే ప్రేక్ష‌కులు హిందీ సినిమాల కోసం థియేట‌ర్ల‌కు రావ‌డం లేద‌ని చెబుతున్నారు. మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్ల‌లో మూడు నుంచి నాలుగు రెట్లు సింగిల్ స్క్రీన్ ల ని మించి టికెట్ ధ‌ర‌లు వ‌సూలు చేస్తున్నార‌ట‌. ఇదే ఇప్ప‌డు హిందీ సినిమాకు ప్ర‌ధాన అడ్డంకిగా మారిన‌ట్టు తెలుస్తోంది.

సింగిల్ స్క్రీన్ లు ద‌క్షిణాదిలో ఎక్కువ‌గా వుండ‌గా ఉత్త‌రాదిలో మాత్రం వాటి సంఖ్య 16 శాతం మాత్ర‌మే వుంద‌ట‌. ఆ కార‌ణంగానే ద‌క్షిణాది చిత్రాలు భారీ స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌గ‌లుగుతున్నాయ‌ని, హిందీ చిత్రాలు ఆ స్థాయిలో రాబ‌ట్ట‌లేక‌పోతున్నాయ‌ట‌. ఇక ఉత్త‌ర భార‌తంతో పోలిస్తే ద‌క్షిణ భార‌తంలో థియేట‌ర్ల‌లో మాత్ర‌మే సినిమాలు చూసే వారు ఎక్కువ‌. ఓటీటీల్లో చూసే వారు త‌క్కువ కానీ ఉత్త‌ర భార‌తంలో మాత్రం థియేట‌ర్ల‌కు రాకుండా ఓటీటీల‌ని ఆశ్ర‌యించే వారి సంఖ్యే ఎక్కువ‌గా వుంద‌ని, అదే బాలీవుడ్ సినిమాల‌కు ఇబ్బందిక‌రంగా మారింద‌ని స‌ర్వే తెలియ‌జేసింది.

ఓటీటీల వ‌ల్లే ప్ర‌ధానంగా బాలీవుడ్ కుదేల‌వుతోంద‌ని కూడా తాజా స‌ర్వే వెల్ల‌డించింది. చాలా వ‌ర‌కు ద‌క్షిణాదితో పోలిస్తే 50 శాతం మంది ఓటీటీల‌పైనే ఆధార‌ప‌డుతున్నార‌ని, అంతే కాకుండా క్రోమ్ కాస్ట్ వంటి టీవీల‌కు ఎడిక్ట్ కావ‌డం వ‌ల్లే ఉత్త‌రాదిలో సినిమా థియేట‌ర్ల‌కు రావ‌డం లేద‌ని తెలిపింది. ఇండియా వైడ్ గా ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ల‌కు 45 కోట్ల మంది ఓటీటీ చందాదారులు వున్నార‌ని.. వ‌చ్చే ఏడాది నాటికి ఈ సంఖ్య రికార్డు స్థాయికి చేర‌డం ఖాయ‌మ‌ని స్ప‌ష్టం చేసింది.
Tags:    

Similar News