రాజమౌళి - త్రివిక్రమ్ మధ్య ఏదైనా కోల్డ్ వార్ నడుస్తోందా..?

Update: 2022-09-14 02:30 GMT
ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న అగ్ర దర్శకులలో ఎస్ ఎస్ రాజమౌళి మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రతీ హీరో కూడా తమ కెరీర్ లో ఒక్కసారైనా వర్క్ చేయాలని కోరుకునే డైరెక్టర్లు వీరిద్దరూ.

దర్శకధీరుడు రాజమౌళి వెండితెరపై విజువల్ వండర్స్ క్రియేట్ చేస్తూ.. భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరిగా నిలిచారు. ఎన్నో రికార్డులు సృష్టించారు. మన సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పి.. తెలుగు చిత్ర పరిశ్రమకు పాన్ ఇండియా బాట వేశారు.

మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ - తనదైన శైలి డైలాగ్స్ తో ప్రేక్షకులను అలరిస్తూ.. నాన్-ఎస్ఎస్ఆర్ రికార్డులు నెలకొల్పుతున్నాడు. ఆసక్తికరంగా ఇద్దరు స్టార్ డైరెక్టర్స్ కూడా ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు.

త్రివిక్రమ్ ఇప్పటికే మహేష్ తో SSMB28 చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. జక్కన్న మాత్రం SSMB29 ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నారు. అయితే ఈ ఇద్దరు దర్శకుల మధ్య కోల్డ్ వార్ జరుగుతోందని ఇన్‌సైడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

మంగళవారం మహేష్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాడు త్రివిక్రమ్. బ్లాక్ బస్టర్ కాంబోలో హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోందని.. 'SSMB28 ఆరంభం' అంటూ మేకర్స్ ప్రకటించారు. ఫస్ట్ డే షూటింగ్ కు సంబంధించిన గ్లిమ్స్ ను కూడా వదిలారు.

దీంతో మహేష్-త్రివిక్రమ్ సినిమా వార్తలే సోషల్ మీడియాలో సందడి చేశాయి. అలాంటి టైంలో మహేష్ బాబు తో గ్లోబ్‌ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేయనున్నట్లు రాజమౌళి ప్రకటన చేసారు. ఇదే అనేక సందేహాలు రేకెత్తేలా చేసింది.

రాజమౌళి ప్రకటన కారణంగా #SSMB29 సినిమా గురించే నెట్టింట ఎక్కువగా చర్చలు జరిగాయి. దీంతో చాలా మంది సూపర్ స్టార్ అభిమానులు త్రివిక్రమ్ సినిమా మొదటి రోజు షూట్ అప్‌డేట్‌ ను మర్చిపోయే పరిస్థితి వచ్చిందని అంటున్నారు.

అయితే రాజమౌళి ఇదంతా కావాలని చేశారనే విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదని పలువురు ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. టొరెంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో భాగంగా మీడియా ఇంటరాక్షన్ లో జక్కన్న నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అడగడంతోనే.. మహేష్ సినిమా అప్డేట్ ఇచ్చాడని వివరిస్తున్నారు.

మహేష్ సినిమా జోనర్ ఏంటనేది చెప్పాల్సిన సందర్భం వచ్చింది కాబట్టే రాజమౌళి రివీల్ చేశాడని.. ఫిలిం ఫెస్ట్ ని ప్లాన్ చేసి ఇలా చేయలేదు కదా అని ప్రశ్నిస్తున్నారు. ఇలా త్రివిక్రమ్ - రాజమౌళి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని బేస్ లెస్ రూమర్స్ స్ప్రెడ్ చేయడం సరైంది కాదని అభిప్రాయ పడుతున్నారు.

ఏదేమైనా మహేష్ బాబు నటిస్తున్న SSMB28 & SSMB29 సినిమాల గురించే ఇప్పుడు ఇంటర్నెట్ లో చర్చలు జరుగుతున్నాయని అభిమానులు ఆనంద పడాలని పేర్కొంటున్నారు. రెండు సినిమాలు వేటికవే ప్రత్యేకమైనవని.. రెండింటికీ సమానమైన క్రేజ్ ఉందని.. ఇవి సూపర్ స్టార్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో నిరూపిస్తాయని నమ్మకంగా ఉన్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News