శ్ర‌ద్ద‌గా ట్రై చేసినా ఏదీ వ‌ర్క‌వుట‌వ్వదేం?

Update: 2020-11-30 00:30 GMT
శ్ర‌ద్ధా దాస్ .. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని న‌టి. ఇటీవ‌ల వ‌రుస ఫోటోషూట్ల‌తో హీట్ పెంచేస్తోంది ఈ బ్యూటీ. ట్యాలెంట్ ని నిరూపించుకునేందుకు ర‌క‌ర‌కాల మార్గాల్ని ఆశ్ర‌యిస్తోంది శ్ర‌ద్ధా దాస్. ఓవైపు వెండితెర నాయిక‌గా ఫేడ‌వుట్ అయిపోయినా శ్ర‌ద్ధా ఫోటోషూట్ల ప‌రంగా సోష‌ల్ మీడియా ప్ర‌చారంలో ఏమాత్రం స్పీడ్ త‌గ్గ‌డం లేదు. నిరంత‌రం వేడెక్కించే ఫోటోలు వీడియోల‌తో యువ‌త‌రానికి చేరువ‌వుతోంది.

తాజాగా శ్ర‌ద్ధా షేర్ చేసిన స్పెష‌ల్ ఫోటో యూత్ వాట్సాపుల్లో వైర‌ల్ గా మారింది. టైట్ బ్లాక్ టాప్ .. టైట్ డెనిమ్.. ఆ పైన ఫ్లోర‌ల్ కోట్ తో శ్ర‌ద్దా హాటెస్ట ఫోజిచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు జోరుగా వైర‌ల్ అవుతున్నాయి.

ఆర్య 2- గుంటూరోడు- మొగుడు ఇలా చెప్పుకోద‌గ్గ సినిమాలే చేసినా ఈ శ్ర‌ద్ధా దాస్ ఫేట్ మార‌లేదు. వ‌రుణ్ సందేశ్ స‌ర‌స‌న ప‌లు చిత్రాల్లో న‌టించినా అవేవీ క‌లిసి రాలేదు. అయితే ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలతోనే కాల‌క్షేపం చేసేస్తోంది. కోటిగొబ్బ 3.. నిరీక్ష‌ణ (తెలుగు) అనే సినిమాల్లో నటిస్తోంది. వీటికి సంబంధించిన తాజా అప్ డేట్ తెలియాల్సి ఉంది.
Tags:    

Similar News