అయ్యో శర్వా.. హిట్ టాక్ వచ్చినా లాభం లేదే?

Update: 2022-09-13 04:33 GMT
మంచి టాలెంటెడ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందుకున్న శర్వానంద్ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ చూసి చాలా కాలం అయింది. అప్పుడెప్పుడో 2017 మహానుభావుడు అనంతరం సరైన సక్సెస్ పడింది లేదు. వరుసగా 6 సినిమా డిజాస్టర్ అయ్యాయి. ఇక మొత్తానికి ఇటీవల టైం ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఒకే ఒక జీవితం సినిమా మొదటి రోజే మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

ఇక తర్వాత ఈ సినిమా మౌత్ టాక్ ద్వారానే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పెంచుకుంది. మొదటి రోజు అంటే శుక్రవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం 75 లక్షల షేర్ మాత్రమే అందుకున్న ఈ సినిమా శనివారం రోజు 1.10 కోట్ల షేర్ ను అందుకుంది. ఇక తర్వాత ఆదివారం కూడా అదే తరహాలో 1.31 కోట్ల షేర్ సాధించింది. దీన్నిబట్టి సినిమాకు ఎంత మంచి టాక్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక సోమవారం నాటికి సినిమా ఇదే తరహాలో కొనసాగితే బాగుండు అని అందరూ అనుకున్నారు.

కానీ ఒక్కసారిగా మళ్ళీ కలెక్షన్స్ డౌన్ అయ్యాయి. సోమవారం రోజు కేవలం 60 లక్షల షేర్ మాత్రమే రాబట్టిన ఒకే ఒక్క జీవితం సినిమా మళ్లీ నిలదొక్కుకోవాలి అంటే చాలా కష్టమైన పని. పండగ వాతావరణం హాలిడేస్ లేకపోవడం పైగా మాస్ ప్రేక్షకులకు ఈ సినిమా అంతగా కనెక్ట్ కాకపోవడం వలన కూడా కలెక్షన్స్ ఏమి పెద్దగా పెరగలేదు. టోటల్ గా నాలుగు రోజుల్లో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా 3.84 కోట్ల షేర్ మాత్రమే అందుకుంది. ఇక ఈ సినిమా తమిళంలో కూడా విడుదలైంది కానీ అక్కడ కొంచెం కూడా ప్రభావం చూపలేదు.

ఓవర్సీస్ లో పరవాలేదు అనే విధంగా అయితే 1.20 కోట్ల షేర్ మాత్రమే దక్కింది. వరల్డ్ వైడ్ గా చేసుకుంటే 5.51 కోట్లు షేర్ వచ్చింది. సినిమా థియేట్రికల్ గా అయితే తెలుగులో 7.50 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్ ను బట్టి చూస్తే ఇంకా బ్రేక్ ఈవెన్ సాధించేందుకు 2.49 కోట్లు రాబట్టాలి. మరి ఈ వారంలో ఆ టార్గెట్ ను ఫినిష్ చేస్తుందో లేదో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News