యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ. 'గుంటూర్ టాకీస్' మూవీతో నటుడిగా, రైటర్ గా కొత్త ప్రయాణం మొదలు పెట్టాడు. కృష్ణ అండ్ హిస్ లీలా, మా వింత గాధ వినుమా వంటి సినిమాలకు కూడా రైటర్ గా తన మార్కు చూపించిన సిద్దూ జొన్నలగడ్డ ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన 'డీజే టిల్లు' తో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి కూడా దర్శకుడు విమల్ కృష్ణతో కలిసి రచనా సహకారం అందించి సినిమా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.
భారీ సినిమాల మధ్య విడుదలైన ఈ మూవీ చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో వసూళ్లని రాబట్టి నిర్మాతకు లాభాల్ని అందించింది. హీరోగా సిద్దూ జొన్నలగడ్డకు మంచి మార్కెట్ ని క్రియుట్ చేయడమే కాకుండా వరుస ఆఫర్లని తెచ్చిపెట్టింది. ఇదిలా వుంటే ఈ మూవీకి సీక్వెల్ గా 'టిల్లు స్క్వేర్' అనే మూవీని సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
దర్శకుడు విమల్ కృష్ణతో పాటు హీరోయిన్ నేహా శెట్టిని కూడా సీక్వెల్ లో మార్చేశారు. ఈ మూవీకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తుండగా హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఇలా ఇద్దరు సీక్వెల్ కి మారిపోవడంతో అంతా షాక్ అయ్యారు.
మరీ ముఖ్యంగా దర్శకుడు విమల్ కృష్ణని మార్చడం వెనక పెద్ద స్టోరీనే నడిచిందని, సిద్దూకు, విమల్ కృష్ణకు మధ్య మనస్పర్థలు తలెత్తడం, 'డీజే టిల్లు' సక్సెస్ క్రెడిట్ మొత్తం సిద్దూ జొన్నలగడ్డ దక్కించుకోవడం వల్లే దర్శకుడు విమల్ కృష్ణ 'టిల్లు స్క్వేర్' నుంచి తప్పుకున్నాడనే కామెంట్ లు వినిపించాయి.
అయితే ఇవన్నీ గాలి వార్తలేనని దర్శకుడు విమల్ కృష్ణ తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తేల్చేశాడు. మళ్లీ మళ్లీ ఒకే క్యారెక్టర్ తో సినిమాలు చేయడం తనకు పెద్దగా ఇష్టం వుండదని, ఆ కారణంగానే తాను 'టిల్లు స్క్వేర్' నుంచి తప్పుకున్నానని స్పష్టం చేశాడు. తాను ప్రస్తుతం కొత్త కథలు సిద్ధం చేస్తున్నానని, త్వరలో సిద్దూ తో ఊహించని కథతో సినిమా చేయబోతున్నానని వెల్లడించాడు. అంతే కాకుండా ఇతర స్టార్ లతోనూ సినిమాలు చేయడానికి చర్చలు జరుపుతున్నానని తెలిపాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.