ఊహించ‌ని మ‌హ‌మ్మారీ దెబ్బ‌కు అల‌.. 100 రోజులు మిస్‌?!

Update: 2020-10-02 01:30 GMT
అన్ లాక్ 4.0 తో చాలా వ‌ర‌కూ వ్యాపారాల‌కు వెసులుబాటు ల‌భించింది. జిమ్ లు మంట‌పాలు పూర్తి స్థాయిలో తెరిచేశారు. ఇక అక్టోబ‌ర్ లో అడుగు పెట్టేసాం కాబ‌ట్టి సినిమా థియేట‌ర్ల‌ను కూడా తెరుచుకునేందుకు కేంద్రం లైన్ క్లియ‌ర్ చేసేయ‌నుంద‌ని ప్ర‌చారమైంది. ఎట్ట‌కేల‌కు ఆ ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది.

తాజాగా అన్ లాక్ 5.0 లో థియేట‌ర్స్ తెరుచుకోవ‌చ్చ‌ని కేంద్రం ప్ర‌క‌టించేయ‌డంతో ఇప్పుడు అస‌లు ర‌చ్చ మొద‌ల‌వ్వ‌బోతోంది..! అయితే ఏ సినిమాల్ని ఆడిస్తారు? లాక్ డౌన్ చేసే టైమ్ కి థియేట‌ర్స్ లో ఉన్న సినిమాల‌తో కొన్ని రొజులు న‌డిపిస్తారా లేక‌.. రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాల్ని వ‌దులుతారా? అన్న‌ది ఇప్పుడు మిలియ‌న్ డాల‌ర్స్ క్వశ్చ‌న్. 50 శాతం ఆకుపెన్సీతో థియేట‌ర్స్ న‌డిస్తే మాత్రం పెద్ద సినిమాల‌తో పాటు మీడియం రేంజ్ సినిమాలు కూడా రిలీజ్ చేయ‌డానికి వాటి నిర్మాత‌లు ముందుకు రారు. ఇక స‌గం ఆకుపెన్సీతో ఉన్న థియేట‌ర్లో సినిమాలు రిలీజ్ చేస్తే లాభాల్లోకి రావ‌డానికి చిన్న సినిమాల‌కి కూడా చాలా టైమ్ ప‌డుతుంది. మ‌రి ఇప్పుడు ఎలాంటి సినిమాలు థియేట‌ర్స్ లో ముందుగా విడుద‌ల అవుతాయో చూడాలి..!

అలానే ఇక్క‌డ ఇంకో విష‌యం కూడా ఆలోచించాలి. మ‌హ‌మ్మారీ ముంచుకొచ్చి దేశంలో లాక్ డౌన్ వ‌స్తుంద‌ని ఊహించ‌క అల వైకుంఠ‌పురంలో.. స‌రిలేరు నీకెవ్వ‌రు.. భీష్మ వంటి సినిమాల్ని కొన్ని థియేట‌ర్స్ వంద రోజులు ఆడించాల్సిందిగా నిర్మాత‌లు ముందే డ‌బ్బులు క‌ట్టేశారట‌. ఇప్పుడు వారు ఈ ఎగ్రీమెంట్స్ తో ముందుకు వెళ‌తారో లేదో కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇప్ప‌టికే ప‌లు సినిమాల్ని రిలీజ్ చేయాల్సి ఉన్నా ఎవ‌రికి వారు ప‌రిస్థితిని స‌మీక్షించుకునే ప‌నిలో ప‌డిపోయార‌ట‌. అన్న‌ట్టు థియేట‌ర్లు తెరిచినా నేను నా థియేట‌ర్ల‌ను తెర‌వ‌న‌ని డి.సురేష్ బాబు లాంటి ఎగ్జిబిట‌ర్ కం నిర్మాత ఖ‌రాకండిగా చెప్పేశారు. అలాంట‌ప్పుడు మిగ‌తావాళ్ల స‌న్నివేశ‌మేమిట‌న్న‌దానికి కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది.
Tags:    

Similar News