రామ్ చరణ్- రామారావు -రాజమౌళి కాంబినేషన్ లో RRR చిత్రీకరణ శర వేగంగా పూర్తవుతోంది. ప్రస్తుతం చరణ్ పై అల్లూరి సీతారారాజు పాత్ర కు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ముందుగా ప్రకటించిన తేదీ కే సినిమా ను రిలీజ్ చేసేలా షూటింగ్ ను త్వరితగతిన పూర్తి చేయాలని జక్కన్న పరుగులు పెట్టిస్తున్నారట. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు మెగా-నందమూరి అభిమానుల్ని ఆకట్టుకున్నాయి. సీతా రామరాజు గా చరణ్.. కొమురం భీమ్ గా తారక్ రూపాలు ఎలా ఉంటాయో అభిమానులు ఓ అంచనాకి వచ్చారు. అయితే ఎంతో కీలకమైన టైటిల్ విషయంలోనే ఇంకా ఏ క్లారిటీ రాలేదు. ఆర్.ఆర్.ఆర్ ని వర్కింగ్ టైటిల్ గానే పరిగణించి చిత్రీకరిస్తున్నారు. దీంతో ఆ మూడక్షరాల అంతరార్థం ఏమిటో అభిమానులు.. నెటి జనుల్లో బోలెడన్ని ఆరాలు అన్వేషణల తో టెన్షన్ కనిపిస్తోంది.
రామ రావణ రాజ్యం.., రామ రౌద్ర రుషితం.., రైజ్ రివోల్ట్ రివేంజ్ ఇలా గెస్సింగ్ టైటిల్స్ ఇప్పటి కే వినిపించాయి. దీంతో జక్కన్నే స్వయంగా ఆ ఛాన్స్ అభిమానులకే ఇస్తున్నాను కనిపెట్టండి!! అంటూ ఆ మధ్య కాంటెస్ట్ పెట్టాడు. కానీ ఇప్పటివరకూ దానికి సంబంధించిన అప్ డేట్ ఏదీ రివీల్ చేయలేదు. ఏ టైటిల్ పై ఎక్కువ మంది ఆసక్తి చూపించారు. ఓటింగ్ దేనికి ఎక్కువ పడింది. అసలు జక్కన్న మైండ్ లో ఉన్న అసలు టైటిల్ ఇదేనా? లేక మరో టైటిల్ ఆలోచన ఏదైనా ఉందా? అన్న క్యూరియాటీ నెలకొంది. టైటిల్ పరంగా ఇంకా దేనికీ తెర దించలేదు. నాటి నుంచి రాజమౌళి ఎలాంటి అప్ డేట్ ఇవ్వక పోవడంతో ఆ విషయం గాలికి వదిలేసినట్టేనా? అంటూ అభిమానుల్లో విమర్శల స్వరం వినిపిస్తోంది.
ఇక కొత్త ఏడాది కి ఇంకా నెల రోజుల కు పై గానే సమయం ఉన్న నేపథ్యం లో న్యూ ఇయర్ సందర్భం గా కొత్త ప్రచార చిత్రాలు రిలీజ్ చేసే అవకాశం ఉందని ప్రచారమవుతోంది. మరి అప్పుడైనా జక్కన్న టైటిల్ విషయం చెబుతాడా? సస్పెన్స్ ని ఇలానే కొన సాగిస్తాడా? అసలు జక్కన్న మనసు లో ఆర్.ఆర్.ఆర్ వెనుక అర్ధం ఏమిటి? అన్నది తేలాల్సి ఉంది. టైటిల్ ఛాన్స్ ఆయనే తీసుకుంటాడా? అన్న సందేహాలకు ఎప్పుడు తెర దించుతాడోనన్న ఉత్కంఠ అలానే ఉంది. రైట్ టైమ్ ఎప్పుడో జక్కన్నా?