మెగా హీరోలు క్రేజీ కార్పొరెట్ బ్రాండ్ లకు అంబాసిడర్ లుగా మారడం కొత్తేమీ కాదు. బ్రాండ్ లకు ఊపు తెచ్చిందే మెగా వృక్షం చిరంజీవి. టాలీవుడ్ లో కార్పొరెట్ యాడ్లకు భారీ పారితోషికాలు అందుకున్నది ఆయన. మెగాస్టార్ చిరంజీవి `థమ్సప్` యాడ్ నుంచి టాలీవుడ్ లో బ్రాండ్ అంబాసిడర్ ల పరంపర ఊపందుకుంది. ఆ తరువాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పెప్సీ ఉత్పత్తులకు ప్రచార కర్తగా మారడం ఆ తరువాత తప్పుకోవడం తెలిసిందే. అనంతర కాలంలో పవన్ పూర్తిగా బ్రాండ్ల ప్రమోషన్ నే వదిలేశారు. రామ్ చరణ్ కూడా పెప్సీ యాడ్ లో నటించారు. కానీ ఇప్పుడు ఫేజ్ మారింది.
ప్రస్తుతం బ్రాండ్ ల క్రేజ్ మరింతగా పెరిగింది. పైగా `బాహుబలి` తరువాత టాలీవుడ్ స్టార్లని తమ బ్రాండ్ లకు ప్రచార కర్తలుగా ఎంచుకోవడం కోసం అంతర్జాతీయ ఉత్పత్తుల కంపనీలు కూడా క్యూ కట్టడం ప్రారంభించాయి. ఇప్పుడు మెగా హీరోలకే కాదు ఇతర హీరోలకు భారీ అవకాశాలొస్తున్నాయి. మన యువ హీరోలకు హీరోయిన్ లకు కమర్షియల్ యాడ్ ల మార్కెటింగ్,.. రెమ్యునరేషన్ ల విషయంలో భారీ డిమాండ్ ఏర్పడింది. ఇందుకు తగ్గట్టే మన స్టార్లు కూడా భారీ స్థాయిలో బ్రాండింగ్ యాడ్ ల కోసం డిమాండ్ చేస్తున్నారు. కొంత మంది క్రేజీ స్టార్ లు కోట్లల్లో ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఆశ్చర్యపరుస్తున్నారు.
ఇటీవలీ కాలంలో ఓటీటీలకు భారీ క్రేజ్ పెరిగిపోయిన విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాన ఓటీటీ దిగ్గజాలు ప్రాంతీయ భాషల్లోనూ తమ సత్తాని చాటాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకు ఆ ప్రాంత క్రేజీ స్టార్లని బ్రాండ్ అంబాసిడర్ లుగా ఎంపిక చేసుకుని వారికి భారీ స్థాయిలో పారితోషికాల్ని అందించి అక్కడి ప్రేక్షకుల్లోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నాయి.
నెట్ ఫ్లిక్స్ తో పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లాంటి దిగ్గజ ఓటీటీలు ఇప్పటికే ప్రాంతీయ భాషల్లో ప్రచారం మొదలుపెట్టాయి. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఇప్పటికే బిగ్ బాస్ వంటి షోలతో తన హంగామా మొదలుపెట్టింది. తెలుగులో మరింతగా తన మార్కెట్ ని విస్తరించడం కోసం మెగా వపర్ స్టార్ రామ్ చరణ్ ని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది. `మన వినోద విశ్వం` అనే ట్యాగ్ లైన్ తో రామ్ చరణ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ని ప్రమోట్ చేయబోతున్నారు. ఇందు కోసం చరణ్ కు భారీగానే పారితోషికాన్ని డిస్నీ సంస్థ వర్గాలు అందించినట్టుగా తెలిసింది. చరణ్ ని మెజీషియన్ గా మార్చి తాజాగా తీసిన ప్రచార చిత్రంపై ఆయన అభిమానులు పెదవి విరుస్తున్నారు.
చరణ్ ని ప్రేక్షకులకు వినోదాన్ని పంచే మాయల మరాఠీగా ప్రజెంట్ చేయడం,.. ఆ కాస్ట్యూమ్స్.. మెగా అభిమానులకు అవమానకరంగా వుందట. ఒక స్టార్ హీరోని ఇలాగేనా వాడేది? అంటూ ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. ఏడిదికి 5 నుంచి 7 కోట్లు చరణ్ డిస్నీ ప్రచారం కోసం అదుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో అభిమానులు చరణ్ నిర్ణయంపై పెదవి విరిచేయడం చర్చనీయాంశంగా మారింది. ఎక్కడా మెగా రేంజ్ కనిపించలేదని.. సొంత ఓటీటీతో వస్తాడనుకున్న చరణ్ ఇలా మాంత్రికుడి గెటప్ లో ఓ సాధారణ హీరోలా కనిపించడం ఏమీ బాగాలేదని కామెంట్ లు చేస్తున్నారు. అంతే కాకుండా చరణ్ పై ఈ తరహా యాడ్ ని డిజైన్ చేసి డిస్నీ వర్గాలు ఆయనని ఆయన స్టార్ డమ్ ని అవమానించాయని మండిపడుతున్నారు.
ఇంత ఇమేజ్ వుండి రామ్ చరణ్ డిస్నీ హాట్ స్టార్ విషయంలో తప్పు చేశాడా? .. ఆ సంస్థ బ్రాండ్ అంబాసిడర్ గా మారి తన స్థాయిని తగ్గించుకుంటున్నాడా? అని అభిమానులు వాపోతున్నారు. చరణ్ చేసి డిస్నీ హాట్ స్టార్ యాడ్ పై అభిమానుల్లో ప్రస్తుతం హాట్ హాట్ చర్చ జరుగుతోంది. ఇదిలా వుంటే రామ్ చరణ్ తొలిసారి యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్న ప్రతిష్టాత్మక భారీ మల్టీస్టారర్ `ఆర్ ఆర్ ఆర్` ఈ దసరాకు రావడం కష్టమనే వాదనలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. రాజమౌళి `ఎన్టీఆర్ - ఒలివియాల లవ్ ట్రాక్ పై ఆసంతృప్తిగా వుండటమే ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఈ మూవీతో పాటు రామ్ చరణ్ తండ్రి చిరుతో కలిసి `ఆచార్య` చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ దాదాపుగా చివరి దశకు చేరుకుంది. ఇటీవలే ది గ్రేట్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో ఓ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని అంగీకరించిన విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. అక్టోబర్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది.