థియేట‌ర్లు తెరిచే తేదీ ఇదేనా? స‌మ‌స్య ప‌రిష్కార‌మైన‌ట్టేనా!?

Update: 2021-07-10 06:39 GMT
ప్ర‌స్తుత క్రైసిస్ స‌మ‌యంలో థియేట‌ర్ల‌ను తెర‌వాలా వ‌ద్దా? ఇండ‌స్ట్రీలో హాట్ డిబేట్ ఇది. సెకండ్ వేవ్ ఉధృతి త‌గ్గినా కానీ ఇంకా థియేట‌ర్ల‌ను తెరిచేందుకు తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిట‌ర్లు ఇంకా ఎందుక‌నో సందేహిస్తున్నారు. తెలంగాణ‌లో 100శాతం ఏపీలో 50శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్ల‌ను తెరుచుకునేందుకు ప్ర‌భుత్వ అనుమ‌తులున్నాయి. ఏడాదిన్న‌ర కాలంగా థియేట‌ర్లు మెజారిటీ భాగం మూత ప‌డి ఉన్నాయి. ప్ర‌భుత్వ వెసులుబాటు ఉన్నా క‌నీసం ఇప్పుడైనా త్వ‌ర‌పడి సినిమాలు ఆడించాల‌ని అనుకునే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఇంకా వెయిటింగ్ దేనికి.. థ‌ర్డ్ వేవ్ కి భ‌య‌ప‌డేనా? అంటే అదొక్క‌టే కాదు.. ఇంకా చాలానే అర్థం చేసుకోవాల్సిన సంగ‌తులు ఉన్నాయి.

త‌మ సినిమాల్ని ఓటీటీల‌కు అమ్ముకుంటామంటే ఎగ్జిబిట‌ర్లు ఇప్ప‌టికే నిర్మాత‌ల‌కు అల్టిమేట‌మ్ జారీ చేస్తున్నారు. దీంతో వెన‌క్కి త‌గ్గిన అగ్ర నిర్మాత‌లు సైతం థియేట‌ర్లు తెరిచే వ‌ర‌కూ వేచి చూడాల్సిన ప‌రిస్థితి. అయినా ఇంకా తెలంగాణ‌- ఏపీలో థియేట‌ర్ల‌ను తెర‌వ‌లేదు. ఇంకా ఎగ్జిబిట‌ర్లు అంతా వేచి చూసే ధోరణిని అనుస‌రిస్తున్నారు. అంతేకాదు.. ఏపీలో టిక్కెట్టు ధ‌ర‌ల విష‌య‌మై ప్ర‌భుత్వ జీవోని ఉప‌సంహ‌రించుకోవాలి. అక్క‌డ కూడా తెలంగాణ రేట్ల‌నే వ‌ర్తింప‌జేయాలి. డిమాండ్ ని బ‌ట్టి టిక్కెట్టు ధ‌ర‌లు పెంచుకునే వెసులుబాటును ఎగ్జిబిట‌ర్ల‌కు క‌ల్పించాలి.

ఇదేగాక అన్ని థియేట‌ర్ల‌కు క్రైసిస్ కాలానికి క‌రెంటు బిల్లుల్ని మాఫీ చేయాలి. అలాగే జీఎస్టీ చెల్లింపుల‌ను ప‌ర్సంటేజీ త‌గ్గించి మున్సిపాలిటీలు ప్ర‌భుత్వాలు ఆదుకోవాలి. దీంతో పాటే ఆస్తిప‌న్ను ర‌ద్దు అప్పుల‌పై వ‌డ్డీల మాఫీ వంటి అంశాల‌ను ఎగ్జిబిట‌ర్లు తెర‌పైకి తెచ్చారు. తెలంగాణ‌లో థియేట‌ర్ల‌లో నామ‌మాత్ర‌పు పార్కింగ్ ఫీజుల‌ను అమ‌లు చేయాలి. పార్కింగ్ ర‌ద్దు జీవోని ఉప‌సంహ‌రించాలి.

థియేట‌ర్ల రంగాన్ని ఆదుకోవాలంటే అన్ని కోణాల్లోనూ ప్ర‌భుత్వం అండ‌గా నిలిస్తేనే హాళ్ల‌ను తెరవ‌గ‌లం అని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. ఇప్ప‌టికే ఆ మేర‌కు తెలంగాణ ఏపీ ప్ర‌భుత్వాల‌కు అభ్య‌ర్థ‌నలు పంపారు. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ ఎటువైపూ ప్ర‌భుత్వాల నుంచి స‌రైన స్పంద‌న లేదు. త్వ‌ర‌లోనే దీనిపై స్ప‌ష్ఠ‌త వ‌స్తుంద‌ని ఆశిస్తున్నారు.

ఏదేమైనా అన్నిటినీ ప‌రిష్క‌రించుకుని ఈ నెల 23 నుంచి థియేట‌ర్ల‌ను తెరుస్తార‌ని ఊహిస్తున్నారు. శుక్ర‌- శ‌ని - ఆదివారాలు జ‌నాల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించే వ్యూహంతో ఫ్రైడేని ఎంపిక చేసుకున్నార‌ట‌. ఆ రోజు క్రేజీగా ఆడే సినిమాని రిలీజ్ చేయక‌పోయినా చిన్న సినిమాల్ని రిలీజ్ చేసేందుకు ఆస్కారం ఉంది. తొలి వారం ఇంత‌కుముందు ఆడి వెళ్లిన వ‌కీల్ సాబ్ లాంటి వాటిని ఆడించే వీలుంది. అలాగే ఆ త‌ర్వాతి వారం `తిమ్మ‌రుసు` రిలీజ్ కి రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. నాని - ట‌క్ జ‌గ‌దీష్‌.. రానా -విరాట‌ప‌ర్వం వంటి చిత్రాల‌ను థియేట‌ర్ల‌లోకి రిలీజ్ చేసేందుకు ఆస్కారం ఉంది
Tags:    

Similar News